బిగ్ బాస్2: నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు.. కౌశల్ పై నాని కామెంట్స్!

By Udayavani DhuliFirst Published 22, Sep 2018, 5:27 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకానికి చేరుకుంది. వచ్చే వారంతో ఈ షో పూర్తి కానుంది. ఈ వీక్ లో హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉండడంతో హౌస్ నుండి ఎవరు వెళ్లబోతున్నారనే ఆసక్తి నెలకొంది

బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకానికి చేరుకుంది. వచ్చే వారంతో ఈ షో పూర్తి కానుంది. ఈ వీక్ లో హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉండడంతో హౌస్ నుండి ఎవరు వెళ్లబోతున్నారనే ఆసక్తి నెలకొంది.

అలానే సోమవారం ఎపిసోడ్ నుండి హౌస్ లో చోటుచేసుకున్న వివాదాల గురించి హోస్ట్ నాని ఎలాంటి కామెంట్స్ చేస్తాడో..? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా శనివారం ఎపిసోడ్ ఎలా ఉండబోతుందని ఓ ప్రోమోని విడుదల చేసింది బిగ్ బాస్ టీమ్. ఈరోజు ఎపిసోడ్ లో నాని హౌస్ మేట్స్ అందరికి చీవాట్లు పెట్టినట్లు కనిపిస్తోంది.

ముందుగా నాని మీ అందరినీ చూస్తే చాలా ఎమోషనల్ గా ఉంది.. లాస్ట్ వీక్ కాబట్టి అంటూ హౌస్ మేట్స్ తో చెబుతూనే ఈ వారం తను ఎంతగా చాలా బాధ పడ్డారనే విషయాన్ని వెల్లడించారు. హౌస్ లో ఒకరితో ఒకరికి ఏమైనా ఇష్యూస్  ఉంటే పరిష్కరించుకోమని చెప్పానే కానీ గొడవ పడమని కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

సెలబ్రిటీలని హౌస్ లో పెడితే మీరు సమాజానికి ఏం చెప్తున్నారంటూ ప్రశ్నించారు. ఎవరికున్న ఇష్యూ ని వాళ్లే అడ్రెస్ చేసుకొని ఉంటే బాగుండేదని అన్నారు. కౌశల్ వైపు చూస్తూ.. 'నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు' అని చెబుతూనే.. హౌస్ మేట్స్ ని ఉద్దేశించి వారు చేసింది కూడా ఊహించలేదని మొత్తం ఎపిసోడ్ డిసప్పాయింట్ చేసిందని వెల్లడించారు. 

Last Updated 22, Sep 2018, 5:27 PM IST