ఆ ప్రొడ్యూసర్ హీరోయిన్ ని వదిలి ఉండలేకపోతున్నాడట!

Published : Sep 22, 2018, 05:04 PM IST
ఆ ప్రొడ్యూసర్ హీరోయిన్ ని వదిలి ఉండలేకపోతున్నాడట!

సారాంశం

మీడియా ముందుకు రావడానికి  మొహమాట పడే ఓ కుర్ర నిర్మాత ఇప్పుడు టాలీవుడ్ హాట్ హీరోయిన్ తో అఫైర్ సాగిస్తున్నాడు. ఈ నిర్మాత తండ్రి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు. 

మీడియా ముందుకు రావడానికి  మొహమాట పడే ఓ కుర్ర నిర్మాత ఇప్పుడు టాలీవుడ్ హాట్ హీరోయిన్ తో అఫైర్ సాగిస్తున్నాడు. ఈ నిర్మాత తండ్రి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు. అయినప్పటికీ తన తండ్రి బ్యానర్ కి అనుబంధ సంస్థగా మరో బ్యానర్ ఏర్పాటు చేసి దానిపై సినిమాలు చేస్తున్నాడు కుర్ర ప్రొడ్యూసర్.

గత కొంతకాలంగా ఇతడు హీరోయిన్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. సదరు బ్యూటీ అమెరికాలో పుట్టి పెరిగి సినిమాల మీద మక్కువతో టాలీవుడ్ లోకి వచ్చింది. కొంతకాలం వరకు ఓ స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ కూడా సాగించింది. కానీ ఈ కుర్ర ప్రొడ్యూసర్ కోసం డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చేసింది.

ఇప్పుడు ఈ భామకి ఆఫర్లు ఇప్పించడం కోసం సదరు ప్రొడ్యూసర్ తనకున్న పరిచయాలను వాడుతున్నట్లు సమాచారం. అంతేకాదు తన సొంత బ్యానర్ లో కూడా ఛాన్స్ లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

అయితే ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో ఆమె రిపీట్ చేయొద్దని అతడికి చెబుతున్నా.. తను మాత్రం హీరోయిన్ కోసం చేయాల్సినవన్నీ చేస్తున్నాడట. ఈ విషయం నిర్మాత కుటుంబ సభ్యులను కూడా బాధ పెడుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఈ నిర్మాత మాత్రం సదరు హాట్ బ్యూటీని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడట!

PREV
click me!

Recommended Stories

Dhurandhar 2 Day 1 Collection: బాక్సాఫీసు వద్ద ధురంధర్‌ 2 సునామీ, అక్కడ ఆల్‌టైమ్ రికార్డ్.. పుష్ప 2ని కొట్టిందా?
మహేష్ బాబు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? సూపర్ స్టార్ ఒక్క యాడ్ ఫిల్మ్ కు ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలుసా ?