బాలయ్య ఫ్యాన్స్ కు పండగ చేసుకునే అప్డేట్.. ‘ఎన్బీకే107’ నుంచి మాసీవ్ టీజర్ రెడీ..

Published : Jun 09, 2022, 10:22 AM ISTUpdated : Jun 09, 2022, 10:24 AM IST
బాలయ్య ఫ్యాన్స్ కు పండగ చేసుకునే  అప్డేట్.. ‘ఎన్బీకే107’ నుంచి మాసీవ్ టీజర్ రెడీ..

సారాంశం

నందమూరి నంటసింహం బాలకృష్ణ నటిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ మూవీ ఎన్బీకే107 (NBK107). ఈ చిత్రం నుంచి ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్ అందింది. టీజర్ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.   

ఆరుపదుల వయసులోనూ టాలీవుడ్ ను షేక్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎన్బీకే107’. `అఖండ` లాంటి భారీ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత బాలయ్య హీరోగా వస్తోన్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని `క్రాక్‌` హిట్‌ తర్వాత దర్శకుడు గోపీచంద్‌ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ కాంబినేషనల్ లో వస్తున్న NBK107పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా మేకర్స్ అభిమానులు, ఆడియెన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్ అందించారు. 

ఎన్బీకే 107 నుంచి మాసీవ్ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు పండగ చేసుకునే వార్త చెప్పారు. ఈ చిత్రం టీజర్ రెడీ చేశారని, ఈ రోజు సాయంత్రం 6 : 11 గంటలకు ‘ఫస్ట్ హంట్’ పేరిట రిలీజ్ కానున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ను కూడా వదిలారు. ఇందులో పులిచర్ల కు నాలుగు కిలోమీటర్ల దూరంలో అనే కిలోమీటర్ స్టోన్ పై చిందిన రక్తం, గొడ్డలి కనిపిస్తోంది. ఈ పోస్టర్ వచ్చే అప్డేట్ పై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ అప్డేట్ తోనే టైటిల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ‘అన్నగారు’ మరియు ‘జై బాలయ్య’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్న విషయం తెలిసిందే.

గతంలొరు మూవీ నుంచి రిలీజ్ అయిన బాలయ్య పవర్ ఫుల్ పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు గోపిచంద్ మలినేని బాలయ్యను మరింత పవర్ ఫుల్ గా, మాస్ గా చూపించనున్నట్టు అర్థమవుతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లామర్ బ్యూటీ శృతి హాసన్‌ (Shruti Haasan) నటిస్తోంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్