Balakrishna:బాలయ్య, అనీల్ రావిపూడి చిత్రం టైటిల్ ఇదేనా?, భలే ఉందే

By Surya Prakash  |  First Published Jun 9, 2022, 10:09 AM IST

`సెప్టెంబర్- అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణం. బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా ఉంటుంది. ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా ఉండదు. ఇందులో నాతో పాటు బాల‌య్య‌ను కూడా కొత్త‌గా చూస్తారు.



వరస హిట్లతో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య  సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఎఫ్ 3 ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. ఇక బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించి రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించి టైటిల్ అంటూ ఒకటి బయిటకు వచ్చింది. 

ఆ సినిమాకు టైటిల్ గా  'Bro! I Don't Care'అని ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనీల్ రావిపూడి రాసుకున్న కథకు ఈ టైటిల్ ఫెరఫెక్ట్ అని  చెప్తున్నారు.ఈ సినిమాకు మొదట 'I Don't Care'అని అనుకున్నారట. ఆ తర్వాత 'Bro' అని యాడ్ చేసినట్లు చెప్తన్నారు.  ఇప్పుడు ఈ టైటిల్ జనాల్లోకి బాగా వెళ్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Latest Videos

`సెప్టెంబర్- అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్తాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మాణం. బాలకృష్ణ గారు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఆ పవర్ కి తగ్గట్టే సినిమా ఉంటుంది. ఫన్ ఉంటుంది కానీ అంత బిగ్గర్ గా ఉండదు. ఇందులో నాతో పాటు బాల‌య్య‌ను కూడా కొత్త‌గా చూస్తారు. మేము ఇద్దరం కలసి కొత్త మార్క్ లోకి వస్తాం.` అని అనిల్ రావిపూడి చెప్ప‌డంతో వీరి కాంబో ప్రాజెక్ట్‌పై మ‌రిన్ని అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

  అనిల్ రావిపూడి – బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.  ఈ మూవీ క‌థ తండ్రి, కూతురు మ‌ధ్య అల్లుకుని ఉంటుంది. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీలీల నటించ‌బోతోంది.

అనిల్ రావిపూడి ప్ర‌స్తుతం `ఎఫ్ 3`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఇందులో హీరోలుగా న‌టించ‌గా.. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టించారు. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీ శ‌ర్మ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది.  
 

click me!