రెండో పెళ్లికి సిద్ధమైన ఫర్హాన్‌ అక్తర్‌.. నాలుగేళ్ల సహజీవనం తర్వాత..

Published : Jan 05, 2022, 02:14 PM IST
రెండో పెళ్లికి సిద్ధమైన ఫర్హాన్‌ అక్తర్‌.. నాలుగేళ్ల సహజీవనం తర్వాత..

సారాంశం

బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. తన ప్రియురాలు శిబానీ దండేకర్‌ని ఆయన వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ వార్త బాలీవుడ్‌లో వైరల్‌ అవుతుంది.

బాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అక్తర్‌(Farhan Akhtar) రెండో పెళ్లికి సిద్దమవుతున్నారు. నాలుగేండ్ల సహజీవనం అనంతరం తన ప్రియురాలు శిబానీ దండేకర్(Shibani Dandekar)ని వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. 2018 నుంచి Farhan Akhtar, శిబానీ దండేకర్‌ ప్రేమలో ఉన్నారు. ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్టకేలకు మ్యారేజ్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవాలని,అందుకు మార్చి నెలలని ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటున్నారట. అయితే ఆ  సమయానికి కరోనా తగ్గితే గ్రాండ్‌గా వివాహం చేసుకోవాలని ప్లాన్‌ చేసుకున్నట్టు తెలుస్తుంది. ముంబయిలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లోగానీ, గార్డెన్‌లోనూ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేసుకున్నారట ఫర్హాన్‌ అక్తర్‌. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫర్హాన్‌.. హెయిర్‌ స్టయిలీస్ట్ అధునా భబానీని వివాహం చేసుకున్నారు. వీరికి షక్య, అకీరా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. దాదాపు పదహారేళ్ల వైవాహిక జీవితం అనంతరం ఈ దంపతులు విడాకులు తీసుకున్నారు. 

తర్వాత ఇండియా-ఆస్ట్రేలియన్‌ నటి, సింగర్‌, మోడల్‌ శిబానీ దండేకర్‌ ప్రేమలో పడ్డారు. అప్పటనుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫర్హాన్‌ అక్తర్‌.. `జీ లే జరా` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే `మిస్టర్‌ మార్వెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. చివరగా ఆయన `ది స్కై ఈజ్‌ పింక్‌`, `తుఫాన్‌` చిత్రంలో నటించింది. ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక తాను దర్శకత్వం వహిస్తున్న `జీ లే జరా`చిత్రంలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌, అలియాభట్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

ఫర్హాన్‌ అక్తర్‌ ప్రముఖ హిందీ కవి, లిరిసిస్ట్, స్క్రీన్‌ రైటర్‌ జావెద్‌ అక్తర్‌ తనయుడు అనే విషయంతెలిసిందే. జావేద్‌, హానీ ఇరానీలకు ఫర్హాన్‌ జన్మించారు. `భాగ్‌ మిల్కా భాగ్‌` చిత్రంతో నటుడిగా నిరూపించుకున్నారు. పాపులారిటీని సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా `డాన్‌` సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫర్హాన్‌. 

also read: Sanjana Galrani Reaction On Divorce: మండి పడుతున్న ప్రభాస్ హీరోయిన్... ఈసారి ఊరుకోనంటుంది

also read: టబు, శోభన, నగ్మా, జయప్రద, రేఖ, సితార.. ఒంటరి అందాల తారలు.. ఆ దారిలో సమంత?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు