Major Song Release: ప్రమోషన్లు స్టార్ట్ చేసిన మేజర్ టీమ్.. ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే...?

Published : Jan 05, 2022, 01:01 PM IST
Major Song Release: ప్రమోషన్లు స్టార్ట్ చేసిన మేజర్ టీమ్..  ఫస్ట్ సాంగ్ ఎప్పుడంటే...?

సారాంశం

అడివి శేష్(Adivi sesh) హీరోగా తెరకెక్కుతున్న మేజర్(Major) మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న ఈమూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రాబోతోంది.

అడివి శేష్(Adivi sesh) హీరోగా..  గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా డైరెక్షన్ లో రూపొందిన సినిమా మేజర్. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా.. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ పతాకం మరియు సోనీ పిక్చర్స్, ఏప్లస్ఎస్ మూవీస్ తో కలిసి నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే సినిమాలు తీసే హీరో అడివి శేష్.. తన సినిమాలన్నీ ఇప్పటి వరకూ  మంచి విజయాలు సాధించాయి. త్వరలో మేజర్(Major)  సినిమాతో రాబోతున్నాడు శేష్. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ‘మేజర్’  సినిమాను తెరకెక్కించారు.

 

ఈ సినిమాలో మేజర్(Major) ఉన్ని కృష్ణన్ పాత్రను అడివి శేష్(Adivi sesh)  పోషించారు. అడవి శేష్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ నటించారు. ఈ సినిమాతోనే ఈమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ క్యారెక్టర్ కోసం శేష్ చాలా కసరత్తులు చేశాడు. బాడీని పాత్రకు తగ్గట్టు మలుచుకోవడం కోసం చాలా శ్రమించాడు. దీని కోసం ఆయన ఏం చేశాడో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూనే ఉన్నాడు. మేజర్(Major)  మూవీకి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందించారు.

 

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చి సినిమా పై అంచనాలు పెంచాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు టీమ్.  మేజర్(Major) నుంచి ఫస్ట్ సాంగ్ ను ఈ నెల 7న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు మూవీ టీమ్. హృదయమా అంటూ సాగే పాటకు శ్రీచరణ్ ట్యూన్ చేయగా.. సిథ్ధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్ నే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేయబోతున్నారు టీమ్.  దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. శుక్రవారం 7వ తారీకున ఉదయం 11 గంటల 7 నిమిషాలకు సాంగ్ ను రిలీజ్ చేస్తామన్నారు.


మేజర్ మూవీ ఫిబ్రవరి 11న  తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్టు..గతంలోనే వీడియో టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు టీమ్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఇప్పటికే రెండేళ్లకు పైగా మేజర్ సినిమా సెట్స్ మీద ఉంది.  కరోనా వల్ల షూటింగ్ డిలై అవ్వడం..కరోనా ఇబ్బందితో పాటు ఈమధ్య అడవి శేష్ కు ఆరోగ్యం పాడవడం...హాస్పిటలైజ్ అవ్వడంతో.. సినిమా షూటింగ్ ఇంకా లేట్ అయ్యింది. దాంతో ముందే రిలీజ్ అవ్వాల్సిన మేజర్ పిబ్రవరికి  పోస్ట్ పోన్ అయ్యింది

Also Read :  HBD Deepika Padukone: వయసు పెరిగేకొద్దీ వైన్ బాటిల్ లా.. క్రేజ్ పెంచుకుంటున్న ప్రభాస్ హీరోయిన్

                                     

PREV
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి