యంగ్ హీరో ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు హల్ చల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 05, 2022, 02:09 PM IST
యంగ్ హీరో ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు హల్ చల్.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

సారాంశం

బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కార్తీక్ ఆర్యన్ యువతలో ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కార్తీక్ ఆర్యన్ కూడా యువతని ఆకట్టుకునే చిత్రాలపైనే దృష్టి పెట్టాడు.

బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ కార్తీక్ ఆర్యన్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. కార్తీక్ ఆర్యన్ యువతలో ముఖ్యంగా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కార్తీక్ ఆర్యన్ కూడా యువతని ఆకట్టుకునే చిత్రాలపైనే దృష్టి పెట్టాడు. ఇదిలా ఉండగా కార్తీక్ ఆర్యన్ కు ఉన్న లేడీస్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పేందుకు ఇటీవల ఓ సంఘటన జరిగింది. 

ఇద్దరు అమ్మాయిలు కార్తీక్ ఆర్యన్ ఇంటి ముందు హల్ చల్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కార్తీక్ ఆర్యన్ ఒక్కసారి బయటకు రా అంటూ ఆ అమ్మాయిలు రోడ్డుపై నిలబడి గట్టిగా కేకలు పెడుతూ పెద్ద హంగామానే సృష్టించారు. సెక్యూరిటీ వారించినా వినలేదు. 

కార్తీక్ ఆర్యన్ ఒక్కసారి చూడాలి, కలుసుకోవాలి అనే కోరికతో వారిద్దరూ అలా చేసారు. దీనితో ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో సదరు యువతులై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిలుగా మీకు ఆత్మగౌరవం లేదా ? ఇలా సెలెబ్రటీల ఇంటి ముందు నిలబడి గోల చేస్తారా ? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

వెళ్లి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి అంటూ మరికొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. సెలెబ్రిటీలంటే అభిమానులకు క్రేజ్ ఉంటుంది. కానీ ఇలా వారి ఇంటి ముందు హంగామా చేయడం తగదు అని అంటున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. 

తమిళనాడులో అజిత్ కారుని ఓ అభిమాని వెంబడించాడు. అలాగే గతంలో హీరో నితిన్ ఇంటి ముందు ఓ యువతి రచ్చ చేసింది. 

Also Read: RGV vs Perni Nani: పేర్ని నానికి వర్మ వరుస కౌంటర్లు.. పవన్, సంపూర్ణేష్ బాబుని ప్రస్తావిస్తూ..

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కి జోడిగా కృతి సనన్ నటిస్తోంది. ఈ ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు