మెగాస్టార్ 150 పాటలపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి..ఎందుకు?

Published : Dec 29, 2016, 08:03 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మెగాస్టార్ 150 పాటలపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి..ఎందుకు?

సారాంశం

యూ ట్యూబ్ లో కుమ్మేస్తున్న మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 పాటలు పాటల్లో సాహిత్యం పైత్యం ఎక్కువైందంటూ విమర్శల వెల్లువ చిరు పాటల్లో డబుల్ మీనింగ్ ను మించిన పదజాలం రజినీలా స్థాయికి తగ్గ సినిమాలు తీయాలంటున్న ఫ్యాన్స్

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150.. యూట్యూబ్ రికార్డులకు బ్రేక్ పడ్డం లేదు. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి మొదలైన ఈ రికార్డుల వరద.. 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' లిరికల్ వీడియోతో పీక్ స్టేజ్ కి వచ్చేసింది. ఖైదీ నంబర్ 150 టీజర్ కి ఇప్పటివరకూ వచ్చిన వ్యూస్ 6.3 మిలియన్లు. అమ్మడు సాంగ్ కి ఇప్పటి వరకూ వచ్చిన వ్యూస్.. 6.6 మిలియన్లు. సినిమా రిలీజ్ అయేందుకు ఇంకా 15 రోజుల టైం ఉంది కాబట్టి.. అమ్మడు సాంగ్ కి కోటి వ్యూస్ దాటిపోవడం పెద్ద విశేషమేమీ కాదు. నాలుగు రోజుల క్రితం విడుదలైన సుందరి సాంగ్ కి అయితే.. ఇప్పటికే 3.1 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. అయితే అది సాంగ్ క్రేజ్ కాదు  కేవలం మెగాస్టార్ క్రేజ్ మాత్రమే అని ఫ్యాన్స్ అంటున్నారు.

 

మెగాస్టార్ మూవీపై జనాల్లో ఇంత క్రేజ్ ఉన్నా.. మెగాస్టార్ పై విమర్శలు గుప్పిస్తున్న వాళ్లూ ఉన్నారు. అసలు మెగాస్టార్ అంటేనే తెలుగులో నెంబర్ వన్ హీరో. ఖైదీ నెంబర్ 150 సినిమాలో నెంబర్ వన్ హీరో కాస్తా నెంబర్ 150లా అనిపిస్తున్నాడని కొందరు విమర్శిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి తన స్థాయికి తగిన విధంగా ఖైదీ నంబర్ 150 పాటలు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

 

అమ్మడు కుమ్ముడు పాటనే ఉదాహరణగా తీసుకుంటే.. అసలు పదేళ్ల తర్వాత వస్తున్న మెగాస్టార్ 150వ సినిమా అంటే ఎలా ఉండాలి... దాంట్లో పాటలు అంటే ఎలా ఉండాలి అని విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మడు కుమ్ముడు అంటూ సాగే పాట మెగాస్టార్ స్థాయిని దిగజార్చేలా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లిరిక్స్ సంగతి అలా ఉంటే పాట కూడా పెద్దగా శ్రోతల్ని అలరించట్లేదు. మెగా స్టార్ పై ఉన్న అభిమానంతో యూ ట్యూబ్ లాంటి సోషల్ సైట్స్ లో ఆయన పాటల కోసం వెతికి మరీ వచ్చి వాలుతున్న మెగా ఫ్యాన్స్ అమ్మడు కుమ్ముడు సాంగ్ వినగానే పెదవి విరుస్తున్నారు. సామాజిక సందేశం అంటూ తీసిన కత్తి రీమేక్ సినిమాలో రైతన్నలపై తెరకెక్కిన మెగాస్టార్ మూవీ కథలో... బూతు సందేశమా.. ఎందుకీ పాటల్లో బూతు లిరిక్స్ అని వాపోతున్నారు.

 

ఇక సుందరి అంటూ సాగే మరో పాట కూడా ఇటీవలే క్రిస్ మస్ కానుకగా రిలీజ్ చేశారు. ఈ పాట మ్యూజిక్ ఎట్రాక్ట్ చేస్తున్నా దీంట్లో కూడా లిరిక్స్...పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవడ్రా.. మెగా స్టార్ కు ఈ లిరిక్స్ రాసింది అంటున్నారు. హిప్ చూపింది హిప్నటైజ్ చేసింది అంటూ లిరిక్స్ ఉన్న సుందరి పాటను కూడా మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన వయసు మీదపడుతున్నా కొద్దీ... హుందాగా ఉండేలా కథలు ఎంచుకుంటూ... పాటల్లోనే కాకుండా సినిమాలో ఎక్కడా బూతులకు తావులేకుండా చూసుకుంటుంటే... మన మెగాస్టార్ ఎందుకిలా చేస్తున్నాడా అని మెగా ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అసలు చిరంజీవికి ఇలాంటి లిరిక్స్ అంగీకరించమని ఎవరు చెప్పార్రా బాబూ... అని నిట్టూరుస్తున్నారు ఫ్యాన్స్.

 

రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ.. కేంద్ర మంత్రిగా సైతం పనిచేసిన చిరంజీవి... ప్రస్థుతం ఎంపీగా పెద్దల సభలో ఉన్నారు. అలాంటి చిరంజీవి ఒక సామాజిక అంశంపై తీసిన సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ చిత్రంలో పాటలు కూడా అర్థవంతంగా, అలరించేవిగా ఉంటాయనుకుంటే... ఆయన స్థాయిని దిగజార్చే లిరిక్స్ తో ఎందుకు అలాంటి పాటలు రాయించారోనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శల వెల్లువ చివరకు రాజకీయంగా కూడా దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. మరి మెగాస్టార్ పాటల తీరు ఎటు దారి తీస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్
తల్లి కాబోతున్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్, బేబీ బంప్ ఫోటోస్ వైరల్