జూనియర్ మూవీపై అన్నీ వట్టి పుకార్లు-కళ్యాణ్ రామ్

Published : Dec 28, 2016, 01:22 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
జూనియర్ మూవీపై అన్నీ వట్టి పుకార్లు-కళ్యాణ్ రామ్

సారాంశం

జూనియర్ తదుపరి చిత్రంపై రూమర్స్ టైటిల్ ఖరారైందంటూ పుకార్లు పుకార్లు నమ్మొద్దంటున్న కళ్యాణ్ రామ్

జనతా గ్యారేజ్ అందించిన సక్సెస్ కిక్ తో ఫుల్ జోరుమీదున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా కూడా అదే స్థాయిలో లేదా దానికన్నా మిన్నగా ఉండాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నాడు. మొన్నటి దాకా అసలు జూనియర్ తదుపరి సినిమా ఎప్పుడా అని యాంగ్జయిటీ ఉండేది. మొత్తంమీద ఉత్కంఠకు తెరతీస్తూ కళ్యాణ్ రామ్ జూనియర్ సినిమాని ఎనౌన్స్ చేశాడు. ఈ సినిమాపై ఇప్పట్నుంచే రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ ఫిక్స్ అయిందంటూ విశ్వరూపం అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

 

జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ ఆ రేంజ్ సినిమా చేయాలనే ఆలోచనతో 3 నెలలపాటు వెయిట్ చేసిన ఎన్టీఆర్.. ఎట్టకేలకు బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ యాక్సెప్ట్ చేశాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ మూడు పాత్రలు చేయనుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రకటించాడు. అయితే.. ఈ మూవీలో త్రిపాత్రాభినయం చేస్తున్న జూనియర్.. ప్రతీ పాత్రలో నావెల్టీని చూపించబోతున్నాడని.. అందుకే ఈ చిత్రానికి నట విశ్వరూపం అనే టైటిల్ పెడతారనే టాక్ వినిపించింది.

 

ఈ టైటిల్ పై నందమూరి అభిమానులు నిరుత్సాహపడ్డారు కూడా. అయితే.. అసలు తమ చిత్రానికి ఇంకా ఎటువంటి టైటిల్ ను పరిశీలించలేదంటూ తేల్చేశాడు కళ్యాణ్ రామ్. 'అసలు టైటిల్ విషయంలో కానీ.. ఇతర నటీనటులు.. సాంకేతిక వర్గం విషయంలో కానీ ఇప్పటివరకూ ఏదీ ఫైనల్ కాలేదు. మీడియాలో వస్తున్న వార్తలేవీ నిజం కాద'ని కళ్యాణ్ రామ్ స్పష్టంచేశాడు.



ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినట్లుగానే.. అధికారికంగా ఏ కొత్త అప్ డేట్ అయినా తామే చెబ్తామని.. పుకార్లను నమ్మద్దని కోరాడు కళ్యాణ్ రామ్. సంక్రాంతి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

PREV
click me!

Recommended Stories

Vana Veera Review: `వన వీర` మూవీ రివ్యూ, రేటింగ్‌.. సినిమా ఎలా ఉందంటే?
రష్మిక మందన్న పాత జ్ఞాపకాలు, 2025 నేషనల్ క్రష్ కు ఎలా గడిచింది? వైరల్ ఫోటోస్