మోదీకి షాక్.. బయోపిక్ కి బ్రేక్!

Published : Apr 10, 2019, 02:56 PM IST
మోదీకి షాక్.. బయోపిక్ కి బ్రేక్!

సారాంశం

ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' బయోపిక్‌ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' బయోపిక్‌ ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల చేయడానికి వీలులేదంటూ విపక్షాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు సినిమాకు సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికేట్‌ రానందున విడుదలను వాయిదా వేయలేమని వెల్లడించింది. సినిమా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందా? లేదా? అన్నది కేంద్ర ఎన్నికలకమిషన్‌ చూసుకుంటుందని తెలిపింది.

తాజాగా ఈ సినిమా చూసిన ఎన్నికల కమిషన్.. ఎన్నికలు పూర్తయిన తరువాతే బయోపిక్ ని విడుదల  చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల వేల బయోపిక్ ని ఎలా రిలీజ్ చేస్తారని ఈసీ ప్రశ్నించింది. దీంతో రేపు విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.  

ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోదీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు. 

PREV
click me!

Recommended Stories

Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
James Cameron-Rajamouli: పులులతో సీన్లు ఉంటే చెప్పు, వారణాసి సెట్ కి వస్తా.. రాజమౌళితో జేమ్స్ కామెరూన్