షాకిచ్చిన ఫ్యాన్స్..మాట మీద నిలబడగాః రజనీకాంత్‌

By Aithagoni RajuFirst Published Dec 1, 2020, 8:35 AM IST
Highlights

రజనీ తన అభిమాన సంఘం మక్కల్‌ మండ్రం కి చెందిన ఆఫీస్‌ బేరర్‌లతో సోమవారం రజనీ మీట్‌ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీకి సంబంధించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారట.

రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో తమిళనాట ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రజనీ త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే గత కొంత కాలంగా ఆయన రాజకీయ ఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికలు దగ్గరపడుతున్నా, ఇంకా రజనీ నుంచి పొలిటికల్‌ ఎంట్రీకి సంబంధించిన ఎలాంటి స్పందన లేకపోవడంతో పలు విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

దీంతో ఎట్టకేలకు రజనీ తన అభిమాన సంఘం మక్కల్‌ మండ్రం కి చెందిన ఆఫీస్‌ బేరర్‌లతో సోమవారం రజనీ మీట్‌ అయ్యారు. ఈ సందర్భంగా తన రాజకీయ ఎంట్రీకి సంబంధించి వారి సలహాలు సూచనలు తీసుకున్నారట. అదే సమయంలో కోవిడ్‌ 19కి సంబంధించి ప్రస్తుత పరిస్థితులను, అభిమానులు కరోనా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న తీరు, అలాగే రాజకీయ పరిస్థితులు వంటి అనేక విషయాలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా రజనీ కాంత్‌ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు. తాను ఇచ్చిన మాట మీద నిలబడతానని, రాజకీయాల్లోకి రావడం పక్కా అని తెలిపారు. త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని మరోసారి సస్పెన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ సందర్బంగా కొందరు అభిమానులు రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. బీజేపీకి సపోర్ట్ చేస్తే తాము మీ వెంట ఉండమని తేల్చి చెప్పేశారట. మీటింగ్‌కి ముందుగానే కొంత మంది అభిమానులు రజనీ ఇంటికి చేరుకుని నినాదాలు చేపట్టారు. బీజేపీకి వ్య‌తిరేకంగా కొంత‌మంది అభిమానులు నినాదాలు చేయ‌డం గ‌మ‌నార్హం. మీరు రాజ‌కీయాల్లోకి వ‌స్తే మీ వెంటే ఉంటామంటున్న త‌లైవా అభిమానులు.. బీజేపీకి స‌పోర్ట్ చేస్తే మాత్రం ఒప్పుకోమంటూ చెప్ప‌క‌నే చెప్పేశారు. మ‌రి ర‌జినీకాంత్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.  

click me!