ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌కి అరుదైన గుర్తింపు..

By Aithagoni RajuFirst Published Dec 1, 2020, 7:40 AM IST
Highlights

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విన్నర్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. బ్రిటీష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్(బాఫ్టా)' సంస్థ రెహ్మాన్‌ని అరుదైన గుర్తింపుని అందించింది. `ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇన్షియేటివ్‌ అంబాసిడర్‌`గా రెహ్మాన్‌ని నియమించినట్టుగా బాఫ్టా తెలిపింది.

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విన్నర్‌ ఏ ఆర్‌ రెహ్మాన్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. బ్రిటీష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్(బాఫ్టా)' సంస్థ రెహ్మాన్‌ని అరుదైన గుర్తింపుని అందించింది. `ఇండియన్‌ బ్రేక్‌ త్రూ ఇన్షియేటివ్‌ అంబాసిడర్‌`గా రెహ్మాన్‌ని నియమించినట్టుగా బాఫ్టా తెలిపింది. బాఫ్టా రాయబారిగా రెహ్మాన్‌ ఇకపై నెట్‌ఫ్లక్స్ తో కలిసి భారతదేశంలోని ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించాల్సి ఉంటుంది. 

ఇక రాయబారిగా ఎంపికైన సందర్భంగా రెహ్మాన్‌ మాట్లాడుతూ, సినిమాలు, కళలు, క్రీడలు, టీవీ రంగాల్లో ప్రతిభావంతులను గుర్తించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. భారత్‌లోని అద్భుతమైన ప్రతిభావంతులను ప్రపంచ వేదికపై నిలబెట్టడానికి ఆతృతగా ఎదురుచూ్స్తున్నాను. బాప్టాతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది` అని అన్నారు. మరోవైపు బాఫ్టా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమండా బెర్రీ స్పందిస్తూ, మా సంస్థకి రెహ్మాన్‌ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి ఏడాది బాఫ్టా అందించే అవార్డులకు చాలా ప్రాధాన్యతనిస్తారు. ఆస్కార్‌ తర్వాత ఆ స్థాయి గుర్తింపుని సొంతం చేసుకున్నాయి ఈ అవార్డులు. 

ప్రస్తుతం రెహ్మాన్‌ పదికిపైగా చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో `కోబ్రా`, `అయలాన్‌`, `పొన్నియిన్‌ సెల్వన్‌`, `99సాంగ్స్`, `మహవీర్‌ కర్ణ`, `అట్రాంగి రే` చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి. 
 

click me!