టాలీవుడ్ నుంచి మొదటి సారి బెస్ట్ హీరోగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్. సరికొత్త రికార్డ్ సాధించిన ఆయనకు హైదరాబాద్ లో అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. బన్నీ ఇంటిదగ్గర కోలా హలం నెలకొంది.
టాలీవుడ్ నుంచి మొదటి సారి బెస్ట్ హీరోగా జాతీయ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్. సరికొత్త రికార్డ్ సాధించిన ఆయనకు హైదరాబాద్ లో అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. బన్నీ ఇంటిదగ్గర కోలా హలం నెలకొంది.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం ఘనంగా జరిగింది. 2021 సంవత్సరానికి గాను ఇచ్చిన ఈ అవార్డుల్లో విజేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డులను అందుకున్నారు. ఇక తెలుగు రాష్రాల నుంచి దాదాపు 10 అవార్డ్ లు రాగా.. అందులో మొట్ట మొదటి సారి తెలుగు నుంచి ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు అందుకున్నాడు. పుష్ప సినిమాలో తన నటనకు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు బన్నీ.
ఈ అవార్డ్ వేడుకలకు తన భార్య స్నేహా.. తండ్రి అల్లు అరవింద్ తో కలిసి హాజరయ్యాడు అల్లు అర్జున్. ఇక తెలుగు సినిమాకు 69 ఏళ్లుగా ఒక కలలా ఉన్న ఆ అవార్డుని సాధించి అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీకి కానుకగా తీసుకురావడంతో.. బన్నీకి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అవార్డుని అందుకున్న అల్లు అర్జున్.. నిన్న హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇక బన్నీ కోసం అక్కడే ఎదురు చూస్తున్న అభిమానులు.. అక్కడ తెగ సందడి చేశారు.. ఒక పండుగాలా సెలబ్రేట్ చేశారు.
బాణాసంచా కలుస్తూ పూల వర్షం కురిపిస్తూ అల్లు అర్జున్ కి ఘనంగా ఆహ్వానం పలికారు. ఇక అభిమానుల అందరికి థాంక్యూ చెబుతూ, అభివాదం పలుకుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులు తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ మొదటి నేషనల్ అవార్డుని తీసుకు రావడమే కాదు, రీజనల్ సినిమా, కమర్షియల్ సినిమా అని తక్కువగా చూసే ఎంతో మందికి అల్లు అర్జున్ గట్టి సమాధానం ఇచ్చి.. పుష్ప తగ్గేదేలే అనిపించాడు.