
రా ఏజెంట్ గా తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘బీస్ట్’ Beast. ఈ చిత్రానికి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో ఈ రోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ మూవీపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ విజయ్ వారి అంచనాలను అందుకోలేకపోయారు. ఫ్యాన్స్ ను ‘బీస్ట్’ నిరాశ పరిచింది. విజయ్ పై హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న అభిమానులు నెగెటివ్ టాక్ రావడంతో ఆగ్రహానికి గురవుతున్నారు. ఆవేశంతో ఏకంగా థియేటర్ కే నిప్పటించారు.
మొదటి రోజు రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కోసం థియేటర్లను ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. భారీ కటౌట్స్, పోస్టర్లు, లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ వారి అంచనాలను బీస్ట్ అదుకోలేకపోయింది. ముక్యంగా తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఫ్లాఫ్ అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేశంతో తమిళనాడులోని ఓ థియేటర్ లో ఫ్యాన్స్ స్క్రీన్ కు నిప్పటించారు. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) బీస్ట్ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ దళపతి, పూజా హెగ్దే (Pooja Hegde) హీరోహీరోయిన్లుగా నటించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh) మాస్ బీట్ అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత కళానితి మారన్ దాదాపు రూ.150 కోట్లతో ఈ యాక్షన్ అండ్ కామెడీ ఫిల్మ్ ను తెరకెక్కించారు.