ఏపీ ఎలెక్షన్స్.. బాబాయ్- అబ్బాయ్ ఫ్యాన్ వార్!

Published : May 18, 2019, 12:49 PM ISTUpdated : May 18, 2019, 12:54 PM IST
ఏపీ ఎలెక్షన్స్.. బాబాయ్- అబ్బాయ్ ఫ్యాన్ వార్!

సారాంశం

నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య సరైన సంబంధాలు లేవనేది తెలిసిన విషయమే.. అయితే హరికృష్ణ మరణం తరువాత బాలయ్య.. ఎన్టీఆర్ కి దగ్గరైనట్లు కనిపించారు. 

నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య సరైన సంబంధాలు లేవనేది తెలిసిన విషయమే.. అయితే హరికృష్ణ మరణం తరువాత బాలయ్య.. ఎన్టీఆర్ కి దగ్గరైనట్లు కనిపించారు. కానీ అయితే బయట వారికోసమేనన్నట్లు వార్తలు వినిపించాయి. ఎంతగా వీరిద్దరూ మేమంతా ఒక్కటేనని చెబుతూ అభిమానులు మాత్రం ఆ విషయాన్ని ఒప్పుకోలేకపోతున్నారు.

ఇప్పుడు బాబాయ్ - అబ్బాయ్ ల అభిమానులమధ్య సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వార్ నడుస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఫలితాలపై 
ఉత్కంఠ రేగుతోంది. ఎవరు గెలుస్తారనే విషయంలో పెద్ద పెద్ద చర్చలు నడుస్తునాయి.

ఈ క్రమంలో బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో గొడవకి దిగారు. తెలుగుదేశం పార్టీ గెలవని పక్షంలో బాలయ్య కానీ, లోకేష్ కానీ పార్టీని నిలబెట్టలేరని.. ఎన్టీఆర్ మాత్రమే పార్టీని కాపాడగలరని అతడి అభిమానులు ట్వీట్లు వేయడం వివాదం మొదలైంది.

ఎన్టీఆర్ ఒకసారి ప్రచారం చేస్తే పార్టీ దెబ్బతిందని, ఆ తరువాత అతను పార్టీకి ఏమీ చేయలేదని.. బాలయ్య సాయం తీసుకొని ఆ తరువాత ఆయన్ని గౌరవించలేదని.. ఎన్టీఆర్ కి టీడీపీలో స్థానమే లేదని బాలయ్య అభిమానులు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో బాలయ్య, ఎన్టీఆర్ ల అభిమానులు ఒకరినొకరు దూషించుకుంటూ విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఈ గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా