మెగాహీరో సినిమా నుండి దేవిశ్రీ అవుట్!

Published : May 18, 2019, 12:16 PM IST
మెగాహీరో సినిమా నుండి దేవిశ్రీ అవుట్!

సారాంశం

దర్శకుడు హరీష్ శంకర్ చాలా కాలం గ్యాప్ తీసుకొని 'వాల్మీకి' సినిమాను రూపొందిస్తున్నారు. 

దర్శకుడు హరీష్ శంకర్ చాలా కాలం గ్యాప్ తీసుకొని 'వాల్మీకి' సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తమిళంలో సక్సెస్ అయిన 'జిగర్తాండ' సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఎన్నో అవధులు దాటుకొని ఈ సినిమా షూటింగ్ దశకు వచ్చింది. కానీ ఈ మధ్యనే హీరోయిన్ పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ పాట విషయంలో హరీష్ శంకర్ కు దేవిశ్రీప్రసాద్ కు మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని అంటున్నారు. దేవి స్థానంలో మిక్కీ జె మేయర్ ని తీసుకున్నట్లు సమాచారం. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Dhandoraa First Review: శివాజీ 'దండోరా' మూవీ ఫస్ట్ రివ్యూ.. కాంట్రవర్షియల్ కథతో బ్లాక్ బస్టర్ కొట్టేశారా ?
దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?