'వెంకీ మామ'లో సుప్రియ.. నిజమెంత..?

Published : May 15, 2019, 10:00 AM IST
'వెంకీ మామ'లో సుప్రియ.. నిజమెంత..?

సారాంశం

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన నటి సుప్రియ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరమైంది. 

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన నటి సుప్రియ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరమైంది. చాలా కాలం గ్యాప్ తరువాత అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి' సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించింది. 

ఈ సినిమా తరువాత ఆమెకి చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వేటినీ అంగీకరించలేదు. తాజాగా ఆమె 'వెంకీ మామ'లో విలన్ క్యారెక్టర్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తోన్న ఈ సినిమాలో సుప్రియ నెగెటివ్ రోల్ అనగానే కాస్త హైప్ క్రియేట్ అయింది.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. సినిమాలో అసలు సుప్రియకు సెట్ అయ్యే లేడీ క్యారెక్టర్ కానీ, విలన్ క్యారెక్టర్ కానీ లేదని తెలుస్తోంది. ఇక సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్న 'వెంకీమామ' యూనిట్ త్వరలోనే కాశ్మీర్ లో షెడ్యూల్ జరుపుకోనుంది.

ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి దసరా బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉంది చిత్రబృందం. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సురేష్ మూవీస్, పీపుల్స్ మీడియా కలిసి సంయుక్తంగా నిర్మిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

The RajaSaab బాక్సాఫీసు టార్గెట్‌ ఇదే, ప్రభాస్‌ రేంజ్‌ ఇలా ఉంటది.. ఏమాత్రం తేడా కొట్టినా మునిగిపోవాల్సిందే
'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'