రజనీకాంత్ 'దర్భార్'.. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దెబ్బకు బ్రేక్ అవుతున్న టేబుల్స్!

Siva Kodati |  
Published : May 15, 2019, 08:39 AM IST
రజనీకాంత్ 'దర్భార్'.. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దెబ్బకు బ్రేక్ అవుతున్న టేబుల్స్!

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు రజని రాజకీయరంగ ప్రవేశం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రజనీ మాత్రం సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. 

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వయసులో కూడా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు రజని రాజకీయరంగ ప్రవేశం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. రజనీ మాత్రం సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు. గత ఏడాది కాలా, 2.0 చిత్రాలతో సందడి చేసిన రజనీ.. ఈ ఏడాది సంక్రాంతికి పేట చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

మురుగదాస్, రజని తొలి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే తెలిసిందే. తాజాగా రజనీ పాత్ర గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ గా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారట. ప్రస్తుతం ముంబైలో దర్భార్ చిత్ర షూటింగ్ జరుగుతోంది. 

మురుగదాస్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలని డిజైన్ చేస్తున్నారు. అవసరమైన మేరకు రజనీకాంత్ కు డూప్ ని ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ సులభమైన ఫైట్స్ సీన్స్ ని మాత్రం స్వయంగా సూపర్ స్టారే పెర్ఫామ్ చేస్తున్నారట. ఇటీవల టేబుల్స్ ని విరగ్గొట్టే ఫైట్ సీన్ ని రజనీకాంత్ స్వయంగా చేశారట. రజనీకాంత్ స్టైల్ కి తగ్గట్లుగా ఫైట్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా రజనీ సెట్స్ లో ఎప్పటిలాగే సింపుల్ గా ఉంటున్నారట. ప్రత్యేకమైన క్యారవాన్ లో ఉండకుండా చిత్ర టెక్నీషియన్స్, నటులతో కలిసే ఉంటున్నారట. వారందరితో కలసి ఆయన భోజనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ సింప్లిసిటీకి ఇంతకు మించిన ఉదాహరణలు అవసరం లేదని దర్భార్ చిత్రయూనిట్ చెబుతోంది. ప్రస్తుతం రంజాన్ మాసం జరుగుతున్న నేపథ్యంలో ముస్లిం సిబ్బందికి సెలవులు ప్రకటించమని రజనీ నిర్మాతలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?