బన్నీ సినిమాపై షాకింగ్ రూమర్.. టాప్ ఛానల్ కు అదిరిపోయే కౌంటర్!

Siva Kodati |  
Published : May 15, 2019, 09:29 AM IST
బన్నీ సినిమాపై షాకింగ్ రూమర్.. టాప్ ఛానల్ కు అదిరిపోయే కౌంటర్!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రం నిరాశపరచడంతో మంచి కథ ఎంచుకునేందుకు బన్నీకి ఏడాది సమయం పట్టింది. బన్నీ బాగా గ్యాప్ తీసుకున్నా త్రివిక్రమ్ చిత్రాన్ని అంగీకరించడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చివరగా నటించిన చిత్రం నా పేరు సూర్య. ఈ చిత్రం నిరాశపరచడంతో మంచి కథ ఎంచుకునేందుకు బన్నీకి ఏడాది సమయం పట్టింది. బన్నీ బాగా గ్యాప్ తీసుకున్నా త్రివిక్రమ్ చిత్రాన్ని అంగీకరించడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కొన్ని రోజుల క్రితమే బన్నీ త్రివిక్రమ్ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్, బన్నీ సినిమాపై వస్తున్న రూమర్స్ అభిమానులని ఆందోళనకు గురి చేస్తున్నాయి. 

ప్రస్తుతం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో స్విట్జర్లాండ్ టూర్ వెళ్ళాడు. దీనిపై ఇటీవల వివాదాల్లో నిలిచిన ఓ టాప్ ఛానల్ ఊహాగానాలని ప్రసారం చేసింది. త్రివిక్రమ్, బన్నీ చిత్రం ఇటీవలే మొదలైంది. కానీ అల్లు అర్జున్ అప్పుడే స్విస్ కు వెళ్ళిపోయాడు. ఈ చిత్రం వెనుక ఏం జరుగుతోంది.. త్రివిక్రమ్ చిత్రాన్ని వదలిపెట్టి బన్నీ ఎందుకు వెళ్ళిపోయాడు అంటూ సంచలన రూమర్స్ ని ప్రసారం చేసింది. 

సదరు ఛానల్ పై అల్లు అర్జున్ పీఆర్ టీం ఘాటుగా రియాక్ట్ అయి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితమే సదరు ఛానల్ బన్నీ, త్రివిక్రమ్ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుందని వార్త వేసింది. కానీ ఇప్పుడేమో బన్నీ ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటూ వార్త వేస్తోంది. ఇదేం వైఖరి అని పిఆర్ టీం సదరు ఛానల్ ని ప్రశ్నించారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో బన్నీ ఫ్యామిలీ టూర్ వెళ్లారు. నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కావడానికి కాస్త టైం పడుతుంది అని పీఆర్ టీం వెల్లడించింది. 

దీనితో సదరు ఛానల్ తన సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గురించి వేసిన రూమర్స్ ని తొలగించింది. అల్లు అర్జున్ ఫ్యామిలీ స్విస్ లో ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి