యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - కృతి సనన్ జంటగా నటించిన హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. మొన్నటి వరకు అంచనాలు దారి తప్పిన విషయం తెలిసిందే. కానీ ఒక్కదెబ్బతో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - కృతి సనన్ (Kriti Sanon) సీతారాములుగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. హిందూ పురాణాల ఆధారంగా చిత్రం తెరకెక్కుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. సరిగ్గా నెలరోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గతేడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు కారణంగా లాస్ట్ టైం రిలీజ్ చేసిన ట్రైలర్ నాసిరకంగా ఉండటం, రామాయణంలోని ప్రధాన పాత్రలను చూపించే విధానం సరిగా లేకపోవడమే. దీంతో విమర్శలూ తప్పలేదు.
దాదాపు ఎనిమిది నెలలు శ్రమించి బెస్ట్ అవుట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా అద్భుతమైన విజువల్స్ తో విడుదల చేసిన Adipurush Trailerతో లెక్క మారింది. మొన్నటి వరకో లెక్క.. ఇప్పుడొక లెక్క అన్నట్టు ‘ఆదిపురుష్’ టాక్ మారింది. ప్రభాస్ పౌరాణిక ఇతిహాస డ్రామా, ఆదిపురుష్ జూన్ 16న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.
ఈ మూవీ పై ఇప్పుడు భారీ అంచనాలు పెరిగాయి. హిందూ ఇతిహాసమైన రామాయణం ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామాపై అనూహ్యంగా ఎక్సపెక్టషన్స్ పెరిగాయి.
ట్రైలర్ కు ముందు కాస్త సాధారణంగా కనిపించినా .. ట్రైలర్ తర్వాత ఓవర్ నైట్ పరిస్థితి మారిపోయింది. రికార్డ్ సంఖ్యలో వ్యూస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్ తర్వాత సినిమాపై ఉన్న నెగటివిటీ మొత్తం పోయింది. ఈ మూవీ పై ఇప్పుడు భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఆదిపురుష్ చుట్టూ మిగిలి ఉన్నది మాస్ హైప్ మాత్రమే. లార్డ్ శ్రీరాముడిగా ప్రభాస్ ప్రెజెంటేషన్ అట్ట్రాక్టీవ్ గా పనిచేసింది. ట్రైలర్‌లో అతని అద్భుతమైన లుక్ సినిమా మొత్తం మీద పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసింది.
VFX మరియు CGI నాణ్యత చాలా వరకు అప్‌గ్రేడ్ చేయబడింది. ఆ క్వాలిటీ ట్రైలర్ లోనే తెలియడంతో బిగ్ స్క్రీన్ పై ఆడియన్స్ కి అద్భుతమని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మొత్తంగా మొన్నటి వరకు ఒక లెక్క ట్రైలర్ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా మారిపోయి ఇప్పుడు ఆదిపురుష్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా మారింది. మెరుగైన సీజీ వర్క్ తో విజువల్ ట్రీట్ అందించారు. గతంతో పోల్చితే ట్రైలర్ అద్భుతమనిస్తోంది. అలాగే రాముడిగా ప్రభాస్ సినిమాపై అంచనాలు పెంచేశాడు. ట్రైలర్ లోని డైలాగ్స్, విజువల్ ఎఫెక్ట్స్, బీజీఎం అన్నీ అదిరిపోయాయి. Adipurush Trailerను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేశారు. అన్నీ భాషల్లో ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది.