తొలిసారిగా నెగిటివ్ షేడ్స్‏లో మహేష్ బాబు.. త్రివిక్రమ్ ఇవ్వబోయే ట్విస్ట్ ఇదేనా?

By Asianet News  |  First Published May 15, 2023, 8:07 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు తొలిసారిగా తన కేరీర్ లో నెగిటివ్ షెడ్స్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు SSMB28 గురించి క్రేజీ బజ్ నెట్టింట వైరల్ గా మారింది. డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
 


మూడోసారి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయిన విషయం తెలిసిందే. గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ వచ్చాయి. ప్రస్తుతం SSMB28 వర్క్ టైటిల్ తో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. త్రివిక్రమ్, మహేశ్ ప్రస్తుతం సక్సెస్ దారిలో ఉండటంతో ఈ చిత్రంపై హైప్ తారాస్థాయిలో ఉంది. షూటింగ్ ప్రారంభమై చాలా రోజులవుతున్నా ఇప్పటి ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా మరే అప్డేట్ రాలేదు. కానీ ‘ఎస్ఎస్ఎంబీ28’ గురించి ఎప్పుడూ ఏదో క్రేజీ బజ్ వినిపిస్తోంది.

తాజాగా ఫిల్మ్ సర్కిల్లో మరో వార్త చక్కర్లు కొడుతోంది. ఎస్ఎస్ఎంబీ28లో మహేశ్ బాబు తొలిసారిగా డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నారని తెలుస్తోంది. రెండు పాత్రల్లో ఓ రోల్ నెగెటివ్ షేడ్స్ ను కలిగి ఉంటుందని టాక్. కేరీర్ ఫస్ట్ టైం మహేశ్ బాబు నెగిటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆ రెండు పాత్రలతో త్రివిక్రమ్ ఇవ్వబోయే ట్విస్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. 

Latest Videos

త్రివిక్రమ్ రైటింగ్స్, కథను మలుపులు తిప్పే తీరు, సరైన సమయంలో ఇచ్చే ట్విస్టులు ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంటాయి. ఇక ‘ఎస్ఎస్ఎంబీ28’తో ఎలా ఆశ్చర్యపరుస్తారో చూడాలని అభిమానులు వేచి ఉన్నారు. మరోవైపు ఈచిత్ర టైటిల్ పైనా తెగ ప్రచారం జరుగుతోంది. అడవిలో అర్జునుడు, ఆమె కథ, అమ్మ కథ వంటి టైటిల్స్ ను పరిశీలించారని మొన్నటి వరకు టాక్. ప్రస్తుతం ‘అమరావతికి అటు ఇటు’ అనే శీర్షికను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. దివంగత సూపర్ స్టార్ Krishna పుట్టిన రోజు సందర్భంగా విడుదల కానుందని అంటున్నారు. ఆ రోజే ఫస్ట్ గ్లింప్స్ కూడా వస్తుందని తెలుస్తోంది.

చివరిగా మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అదుకున్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ28పైనా హైప్ నెలకొని ఉంది. చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్దే (Pooja Hegde) రెండోసారి ఆడపాడనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 2024న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. 

click me!