హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకున్న మాజీ ప్రియుడు!

Published : Apr 08, 2019, 12:53 PM IST
హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకున్న మాజీ ప్రియుడు!

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింతాకి ఇటీవల ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. తన బాయ్ ఫ్రెండ్ ప్రతీకారం తీర్చుకోవడంతో ఆమె అసహనానికి లోనైంది. 

బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింతాకి ఇటీవల ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. తన బాయ్ ఫ్రెండ్ ప్రతీకారం తీర్చుకోవడంతో ఆమె అసహనానికి లోనైంది. అసలు విషయంలోకి వస్తే.. ఐపీఎల్ లో భాగంగా మోమాలీలో ఢిల్లీ, కింగ్స్ ఎలెవన్ పంజాబీల మధ్య మ్యాచ్ జరిగింది.

దీనికోసం ముంబై నుండి ఢిల్లీకి వెళ్లడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్లింది ప్రీతీ జింతా. అయితే గోఎయిర్ ఫ్లైట్ లో ప్రీతీ ఎక్కడానికి వీలులేదని సిబ్బంది ఆమెకి చెప్పడంతో షాక్ కి గురైంది. గోఎయిర్ విమాన సంస్థకి యజమాని నెస్ వాడియా. 

గతంలో ప్రీతీ అతడితో ప్రేమాయణం సాగించింది. అది కాస్త బెడిసి కొట్టడంతో గోఎయిర్ లో ప్రయాణించకుండా నెస్ వాడియా ఆమెపై ఆంక్షలు విధించాడు. దీంతో విమాన సిబ్బంది ప్రీతీని గోఎయిర్ ఫ్లైట్ లో ప్రయాణించకుండా అడ్డుకున్నారు. ప్రీతికి బోర్డింగ్ పాస్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఆమె ఓ రేంజ్ లో మండిపడ్డారు.

కానీ సిబ్బంది మాత్రం వెనుకడుగు వేయలేదు. దీంతో ప్రీతీ ఎయిర్ పోర్ట్ లోనే ఉండిపోయింది. ఈ సంఘటనతో ఆమె ఇకపై గోఎయిర్ విమానంలో ప్రయాణించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?