'డియర్ కామ్రేడ్' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!

Published : Apr 08, 2019, 12:22 PM IST
'డియర్ కామ్రేడ్' ఫస్ట్ సాంగ్ వచ్చేసింది!

సారాంశం

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'గీత గోవిందం' లాంటి హిట్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. 

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'గీత గోవిందం' లాంటి హిట్ సినిమా తరువాత ఇద్దరూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. 

భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కాలేజ్, పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఈరోజు సినిమా నుండి మొదటి లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..'' అంటూ సాగే ఈ మెలోడీని గౌతం భరద్వాజ్ పాడారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం  అందిస్తున్నారు. మే 31న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Romanchakam Day 5 Collections: సోమవారం పడిపోయిన రోమాంచకం.. 5 రోజుల్లో ఇంత కలెక్షన్లు ఊహించలేం
Ramba Oorvasi Menaka 4 Days Collections: రంభ ఊర్వశి మేనక సోమవారం కలెక్షన్లు.. అల్లరి నరేష్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?