మెగా హీరోస్.. జనసేన ముసుగులో గుద్దులాట?

By Prashanth MFirst Published Apr 8, 2019, 12:30 PM IST
Highlights

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారాలు జోరుగా సాగుతున్నా ఎదో తక్కువైంది అనే టాక్ గట్టిగానే వస్తోంది. అసలు గతంలో మెగా హీరోలు ప్రజారాజ్యం పార్టీకోసం ప్రచారాలు బాగానే చేశారు. కానీ ఇప్పుడు జనసేన కోసం మాత్రం అంత చురుగ్గా పాల్గొనడం లేదనే చెప్పాలి. 

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారాలు జోరుగా సాగుతున్నా ఎదో తక్కువైంది అనే టాక్ గట్టిగానే వస్తోంది. అసలు గతంలో మెగా హీరోలు ప్రజారాజ్యం పార్టీకోసం ప్రచారాలు బాగానే చేశారు. కానీ ఇప్పుడు జనసేన కోసం మాత్రం అంత చురుగ్గా పాల్గొనడం లేదనే చెప్పాలి. ఓ వైపు రామ్ చరణ్ బాబాయ్ కోసం వస్తా అని చెబుతుంటే పవన్ మాత్రం రాకుంటేనే బెటర్ అని చెబుతున్నాడు. 

ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెటర్స్ అయితే వదులుతున్నాడు. అలాగే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు కూడా విషెస్ తెలుపుతుండడంతో ఫ్యాన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ నెలకొంటోంది. వరుణ్ తేజ్ తండ్రి కోసం ఒక రోజు హడావుడి బాగానే చేశాడు. ఇక సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో పోస్టులు ఏస్తున్నాడు గాని జనాల మధ్యకు ఇంకా రావడం లేదు. 

మెగా హీరోలు అసలు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఓ వైపు ప్రత్యర్థి పార్టీలు చిన్న తరహా స్టార్స్ తోనే ఒక రేంజ్ లో ఎలక్షన్ లో కలరింగ్ ఇస్తుంటే.. కోట్ల మంది అభిమానులను గెలుచుకున్న మెగా హీరోలు మాత్రం బాబాయ్ కోసం ఇంకా అఫీషియల్ ప్రచారాలు మొదలెట్టలేదు. ఇక మెగాస్టార్ కాంగ్రెస్ లోకి వెళ్లలేక వేరే పనుల్లో బిజీ అవుతున్నారు. ఆయన రాకుండా ఉంటేనే బెటరేమో..?

ఎలక్షన్స్ ప్రచారంలో హీరోలు పార్ట్ టైమ్ లా పనిచేయడం అస్సలు ఇష్టం లేదని పవన్ తరచు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నాడు. కాకపోతే చరణ్ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు అనే కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. పైగా చరణ్ జనసేన ఆఫీసుల్లో రీసెంట్ గా చలాకీగా కనిపించాడు. బాబాయ్ ఆరోగ్య పరిస్థితి అర్ధం చేసుకొని కాస్త హెల్ప్ చేద్దామని అనుకున్నప్పటికీ పవన్ నో అని ఒక వివరణ ఇచ్చాడట. 

ఎందుకంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు అభిమానులు వివిధ పార్టీలలో ఉంటారు కావున ప్రత్యేకంగా ఒక పార్టీలో ఉంటే వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి యాక్టింగ్ కెరీర్ కు దెబ్బ పడే అవకాశం ఉంది. వీలైనంత వరకు పాలిటిక్స్ ను పక్కనపెట్టడం బెటర్ అని పవన్ యువ హీరోలకు సూచించినట్లు సమాచారం.

అయితే పవన్ నిర్ణయం ఎంతవరకు స్ట్రాంగ్ ఉంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. హీరోలు పార్టీతో రిలేషేన్ మెయింటైన్ చేస్తూనే దురంధురంగా ఉంటున్నారు. ఓ విధంగా పరిస్థితి ముసుగులో గుద్దులాటలా ఉందని టాక్ వస్తోంది. ఫైనల్ గా జనసేన కోసం మెగా హీరోలు బరిలోకి దిగుతారా? లేరా? అనేది ఇప్పట్లో తేలేలా లేదు.     

click me!