అమ్మా నువ్వు లేకుంటే శూన్యం. కన్నీరు పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు లేఖ

Published : Mar 03, 2018, 03:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అమ్మా నువ్వు లేకుంటే శూన్యం. కన్నీరు పెట్టిస్తున్న శ్రీదేవి కూతురు లేఖ

సారాంశం

శ్రీదేవి కూతురు జాన్వి భావోద్వేగం తల్లిని తలుచుకుంటూ సుదీర్థంగా లేఖ రాసిన జాన్వి అమ్మా నువ్వే నా సర్వస్వం, నా ఆనందానికి కారణం నువ్వేనమ్మా ఇప్పుడు శూన్యం ఆవరించిందమ్మా..

శ్రీదేవి హఠాన్మరణంతో ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఒంటరిదైపోయింది. తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె విలవిల్లాడుతోంది. అమ్మకూచిగా ఎప్పుడూ శ్రీదేవితోనే కనిపించే జాన్వీ.. తన బాధను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వ్యక్తం చేసింది. అమ్మ మరణంతో గుండెల నిండా శూన్యం ఆవరించిందని జాన్వీ వాపోయింది. ఇక నుంచి బతకడం నేర్చుకోవాలంటూ.. తల్లిని ఎంతగా మిస్సవుతున్నానో చెప్పకనే చెప్పింది.

‘అమ్మా.. నువ్వు లేవని తెలిశాక నన్ను శూన్యం ఆవరించింది. కానీ ఇప్పటికీ నీ ప్రేమను ఫీలవుతున్నా. బాధ నుంచి, నొప్పి నుంచి నువ్వే కాపాడుతున్నావ్ అనుకుంటున్నా. కళ్లు మూసుకున్న ప్రతి సారీ మంచి విషయాలే నా మదిలో మెదులుతున్నాయి. దానికి నువ్వే కారణం. మా అందరి జీవితాలకు నువ్వే దీవెనవు. ఇంత కాలం నువ్వు మాతో ఉండటం మా ఆశీర్వాదమే. అమ్మా.. నువ్వెంతో మంచి దానివి, నీ మనసెంతో ఎంతో స్వచ్ఛమైంది. ప్రేమకు ప్రతిరూపం నీవు. అందుకే దేవుడు నిన్ను తీసుకెళ్లాడు. కానీ కొన్నాళ్లయినా నువ్వు మాతో ఉన్నావ్.

నేనేప్పుడూ ఆనందంగా ఉంటానని ఫ్రెండ్స్ అంటుంటారు. దానికి కారణం నువ్వేనని ఇప్పటికి తెలుసుకున్నామ్మా. నీవల్ల నాకేదీ పెద్ద సమస్యగా అనిపించలేదు. ఏరోజూ నిస్తేజంగా గడవలేదు. దానికి కారణం నువ్వే. నన్ను ఎంతగానో ప్రేమించావ్. నీ కారణంగానే నువ్వు తప్ప మరెవరి మీదా ఆధారపడాల్సిన అవసరం నాకు లేకపోయింది. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, నువ్వే నా సర్వస్వం. నీ జీవితాంతం ఇతరులకు ఇస్తూనే ఉన్నావ్. నీకోసం నేను కూడా అలాగే ఉందాం అనుకుంటున్నా.

నువ్వు గర్వపడేలా చేస్తానమ్మా. నువ్వు ఇక్కడే ఉన్నావ్. నా హృదయంలో, చెల్లిలో, నాన్నలో.. ఇలా మాతోనే ఉన్నావ్. నువ్వు మమ్మల్ని బలంగా తీర్చిదిద్దావ్. జీవితంలో ముందుకెళ్లడానికి అదొక్కటి చాలమ్మా. కానీ నువ్వు లేని లోటు మాత్రం పూర్తిగా ఎవరూ తీర్చలేరు. ఐ లవ్యూ అమ్మా. నువ్వే నా సర్వస్వం.’

అమ్మను ఉద్దేశించి మనసుల్ని తాకేలా ఇన్‌స్టాగ్రామ్‌లో తన భావాలను పంచుకున్న జాన్వీ.. అందరూ తల్లిదండ్రులను ప్రేమించాలని కోరింది. నా పుట్టిన రోజు సందర్భంగా మీ నుంచి ఆశించేది ఇదే అని ఉద్వేగంగా రాసుకొచ్చింది. మా అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించమని జాన్వీ కోరింది. గత కొద్ది రోజులుగా తమ కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ జాన్వీ ధన్యవాదాలు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా