చైనాలో భజరంగీ భాయ్ జాన్ భారీ ఓపెనింగ్స్.. దంగల్ ను కొడుతుందా?

Published : Mar 03, 2018, 12:44 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
చైనాలో భజరంగీ భాయ్ జాన్ భారీ ఓపెనింగ్స్.. దంగల్ ను కొడుతుందా?

సారాంశం

మార్చి  2న చైనాలో రిలీజైన భజరంగీ భాయ్ జాన్ సల్మాన్ నటించిన ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ దంగల్ రికార్డును కొడుతుందని విష్లేషకులా అంచనాలు

భారత్ లో విడుదలైన రెండేళ్ల తర్వాత సల్మాన్, కబీర్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ చిత్రం చైనాలో రిలీజ్ అయింది. రెండు దేశాల బోర్డర్ ల మధ్య జరిగే ఈ చిత్రంలో సల్మాన్, హర్షాలి మల్హోత్రా, కరీనా కపూర్ ఖాన్ నటించారు. బాలీవుడ్ లో రూ.320 కోట్ల భారీ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం చైనాలోనూ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తోంది.

 

చైనాలో ఈ చిత్రం భారీ అంచనాలు నెలకొల్పింది. ఇప్పటికే... చైనాలో ఆమిర్ ఖాన్ నటించిన దంగల్, సీక్రెట్  సూపర్ స్టార్ సినిమాలు భారీ వసూళ్లు సాధించి రికార్డు  సృష్టించాయి.

 

భారత రెజ్లర్ మహావీర్ సింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా దంగల్. ఈ చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లు వసూళ్లు చేసి  రికార్డుల మోత మోగించింది. అంతేకాక భారత్ లో వసూళ్లయిన మొత్తం కంటే.. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ మూవీగా దంగల్ రికార్డు సృష్టించింది.

 

చిన్న పాత్రే అయినా ఆమిర్ నటించిన మరో చిత్రం సీక్రెట్ సూపర్ స్టార్ చైనీస్ బాక్సాఫీస్ వద్ద రూ.760 కోట్లు వసూళ్లు సాధించింది. భారత్ లో ఇది కేవలం  63.40 కోట్లు మాత్రమే వసూళ్లు చేయటం గమనించాల్సిన అంశం. ఈ చిత్రంలో జైరా వాసిమ్ ప్రధాన పాత్రలో నటించింది.

 

చైనాలో ఆమిర్ ఖాన్ తన అద్భుత నటనతో గుర్తింపు పొందిన నటుడుగా నిరూపించుకున్నాడు. మరి సల్మాన్ ఖాన్ భజరంగీ భాయ్ జాన్ భారీ ఓపెనింగ్స్ సాధించిన నేపథ్యంలో.. దంగల్ రికార్డులు తిరగరాస్తుందా అనే అంచనాలు నెలకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్