మహేష్ స్థాయిని తగ్గించి ఇప్పుడు క్లారిటీ ఇస్తే ఎలా..?

By Udayavani DhuliFirst Published Oct 26, 2018, 2:23 PM IST
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు. అయితే సడెన్ గా ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని వార్తలు గుప్పుమన్నాయి. దానికి రకరకాల కారణాలు వెలుగులోకి వచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక ఈవెంట్ కోసం అమెరికా వెళ్లాలనుకున్నారు. అయితే సడెన్ గా ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని వార్తలు గుప్పుమన్నాయి. 
దానికి రకరకాల కారణాలు వెలుగులోకి వచ్చాయి.

మహేష్ బాబు క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఈవెంట్ మ్యానేజర్ షోకి సంబంధించి ఒక్కో టికెట్ ని రెండు వేల డాలర్లు పెట్టాడని దీంతో టికెట్లు ఎక్కువగా అమ్మడుకాలేదని, విషయం గ్రహించి దాన్ని 450 డాలర్లకు అమ్మాలని చూసిన వర్కవుట్ కాలేదని నష్టంలో షోని నిర్వహించడం మంచిది కాదని భావించి ఈవెంట్ క్యాన్సిల్ చేసినట్లు వార్తలు బయటకొచ్చాయి.

దీంతో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో ప్రోగ్రామ్ అంటే కనీసపు జాగ్రత్తలు తీసుకోకుండా ఆయన స్థాయిని కించపరిచారంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. మధ్యలో మెహెర్ రమేష్ స్టోరీ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే మీడియా దానికి తోచింది రాసుకుంటుందని సదరు ఈవెంట్ మ్యానేజర్ అసహనం వ్యక్తం చేశారు.

''సెక్యురిటీ ఇష్యూల కారణంగానే ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేశాం అంతేకానీ క్యాన్సిల్ చేయలేదు. హైదరాబాద్ లో శిల్పకళావేదిక, జెఆర్సీ ఫంక్షన్ హాల్ లా ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఈవెంట్ ని నిర్వహించలేం. దానికి చాలా తతంగాలు ఉంటాయి. ఇండియా నుండి ఏ సెలబ్రిటీ అమెరికా వచ్చినా ముఖ్యంగా న్యూయార్క్ కి వచ్చినప్పుడు మారియట్ మార్కిస్ హోటల్ లోనే బస చేస్తారు.

అటువంటి హోటల్ లో ఈవెంట్ అంటే సెక్యురిటీ చాలా బలంగా ఉండాలి. కేవలం సెక్యురిటీ రీజన్స్ వలనే షోని వాయిదా వేశాం'' అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే ఈ ఇష్యూ ముదిరిపోయింది. ఈవెంట్ మ్యానేజర్ ఇంత లేట్ గా స్పందించడం వలన మహేష్ రెప్యుటేషన్ కి డ్యామేజ్ జరగడం తప్ప కలిసొచ్చిందేమీ లేదు!

ఇది కూడా చదవండి.. 

మహేష్ పరువు తీయటం కాకపోతే ఎందుకీ పనులు?

మెహర్ రమేష్.. మహేష్ ని దెబ్బ కొట్టాడు,నమ్రత సీరియస్!

click me!