ఎవరు మీలో కోటీశ్వరులు (Evaru meelo koteeswarulu)షోకి మహేష్ గెస్ట్ గా రావడం జరిగింది. ఇద్దరు టాప్ స్టార్స్ ఎన్టీఆర్, మహేష్ మధ్య సరదా సంభాషణలు వినోదం పంచాయి. అలాగే ఈ కార్యక్రమం వేదికగా మహేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
సూపర్ స్టార్ మహేష్ తో ఎన్టీఆర్ (NTR)ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్ అనుకున్నదానికంటే ఎక్కువ వినోదం పంచింది. ప్రశ్నలు అడిగే క్రమంలో ఎన్టీఆర్ మహేష్ ని తికమకపెట్టిన తీరు అలరించింది. అదే సమయంలో ఎన్టీఆర్ మాయలో పడకుండా మహేష్ సమాధానాలు చెప్పిన విధానం అద్భుతం అని చెప్పాలి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ షోలో మహేష్ ని రెండు ప్రశ్నలు ఇబ్బంది పెట్టాయి. అప్పుడు ఆయన హెల్ప్ లైన్ ఆప్షన్స్ తీసుకున్నారు.
10 ప్రశ్నల వరకు మహేష్ (Mahesh)ఎటువంటి హెల్ప్ లైన్ వాడుకోలేదు. దీనితో మూడు హెల్ప్ లైన్స్ అలానే ఉండిపోయాయి. 11వ ప్రశ్నగా మహేష్ ని ఎన్టీఆర్ హిస్టరీ కి సంబంధించిన టాపిక్ ఎంచుకున్నారు. హరిహర రాయలు, బుక్కరాయలు ఏ రాజవంశానికి చెందినవారని అడిగారు. ఈ ప్రశ్నకు మహేష్ తడబడ్డారు. అలాగే ఆయన హెల్ప్ లైన్ తీసుకున్నారు. మహేష్ ఫేవరేట్ దర్శకులలో ఒకరైన కొరటాల శివకు వీడియో కాల్ చేయడం జరిగింది. కొరటాల శివ సంగమ రాజవంశం అని రైట్ ఆన్సర్ చెప్పారు.
ఇక 12వ ప్రశ్న ఫుట్ బాల క్రీడకు సంబంధించినది కాగా... సులభంగా ఆన్సర్ చేశారు. రూ. 25 లక్షల ప్రైజ్ మనీ కి సంబంధించిన 13వ ప్రశ్న వద్ద మహేష్ మరలా టెన్షన్ పడ్డారు. ఆ ప్రశ్న కోసం ఆయన హెల్ఫ్ లైన్ వాడుకున్నారు. జంతువు బొమ్మ లేని లోగో ఉన్న కార్ బ్రాండ్ పేరు చెప్పాలని మహేష్ ని ఎన్టీఆర్ అడిగారు.హెల్ప్ లైన్ ద్వారా నాలుగు ఆప్షన్స్ లో రెండు రాంగ్ ఆన్సర్స్ తొలగించడం జరిగింది. ఫెర్రారీ, లాంబోర్గిని రెండు ఆప్షన్స్ లో లాంబోర్గిని అని మహేష్ రైట్ ఆన్సర్ ఎంచుకున్నారు.
Also read ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కన్ఫర్మ్ చేసిన మహేష్!
ఇక నిన్నటి ఎపిసోడ్ ముగిసే సమయానికి మహేష్ 13 ప్రశ్నలకు సమాధానం చెప్పి రూ. 25 లక్షలు గెలుచుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆయన యాభై లక్షలు, కోటి రూపాయలకు సంబంధించిన రెండు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంది.