Bigg boss Telugu5:లీకైన ప్రియాంక రెమ్యూనరేషన్... 13వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే!

Published : Dec 06, 2021, 09:05 AM IST
Bigg boss Telugu5:లీకైన ప్రియాంక రెమ్యూనరేషన్... 13వారాలకు ఎన్ని లక్షలు తీసుకుందంటే!

సారాంశం

ప్రచారం జరిగినట్లే ప్రియాంక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రియుడు మానస్ ని వదల్లేక భారంగా ప్రియాంక హౌస్ ని వీడింది. తన అందచందాలు, ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియాంక రెమ్యూనరేషన్ లీకైంది.  

జబర్దస్త్ కమెడియన్ గా  పాపులరైన ప్రియాంక బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ (Bigg boss Telugu5) 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. టాన్స్ జెండర్ కావడం ఆమెకున్న మరొక ప్రత్యేకత. అమ్మాయిలకు మించిన గ్లామర్ ప్రియాంక సొంతం కాగా.. తన అందం, ఆటతీరుతో ప్రేక్షకులకు వినోదం పంచారు. ఇక ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ప్రియాంక, కంటెస్టెంట్ మానస్ ప్రేమలో పడిపోయారు. ఎంతగా అంటే అతని కోసం ఏదైనా చేసెంతలా. 


హౌస్ లో ఎప్పుడూ మానస్ చుట్టే తిరిగేది ప్రియాంక (Priyanka). అతడు తిండి తిప్పల గురించి సొంత భార్య మాదిరి కేర్ తీసుకునేది. టాస్క్ లలో, గేమ్స్ లో అతనికి అనుకూలంగా ప్రవర్తించేది. మానస్ గేమ్ కూడా ప్రియాంకనే ఆడుతుంది అంటూ అనేక విమర్శలు వచ్చినా ఆమె తీరు మారలేదు. చివరికి మానస్ స్వయంగా నీ గేమ్ నువ్వు ఆడు అని హెచ్చరించినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 


ఇక ఎలిమినేషన్ తర్వాత ప్రియాంక కన్నీటి పర్యంతం అయ్యారు. మానస్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఆమె కళ్ళ నుండి వరద ప్రవాహంలా నీళ్లు కారిపోయాయి. మనస్ఫూర్తిగా మానస్ ని ప్రియాంక ప్రేమిస్తున్నట్లు ఆమె ప్రవర్తన ద్వారా అర్థం అవుతుంది. ఏది ఏమైనా గేమ్ ని గేమ్ లా చూడాలి. ఇలా ఎమోషనల్ గా దగ్గరైతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

Also Priyanka Eliminated: షణ్ముఖ్‌ ముదిరిన బెండకాయ.. మానస్‌ నుంచి ఆశించేది అదేనట.. పింకీ ఊహించని కామెంట్స్
కాగా 13వారాలు హౌస్ లో ఉన్న ప్రియాంక రెమ్యూనరేషన్ గా ఎంత తీసున్నారనే విషయం లీకైంది. అందిన సమాచారం ప్రకారం ప్రియాంకకు నిర్వాహకులు వారానికి 1.75 నుంచి 2 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు టాక్‌. అంటే ఈ లెక్కన పింకీ 13 వారాలకు గానూ మొత్తంగా దాదాపు రూ. 25 లక్షల రూపాయలు తీసుకున్నారట. అయితే షోలో ఆమె పర్ఫామెన్స్‌ను బట్టి ఈ పారితోషికం కాస్త అటూఇటుగా ఉండే అవకాశముంది.  

Also read Bigg Boss Telugu 5: సన్నీకి చదువు గొప్పదనం నేర్పిస్తే, షణ్ముఖ్‌కి కోపం తగ్గించిందట.. నాగ్‌ పంచ్‌లు.. నవ్వులే

PREV
click me!

Recommended Stories

Nivetha Pethuraj పెళ్లి ఆగిపోయిందా? ఫోటోలు డిలీట్ చేసిన స్టార్‌ హీరోయిన్‌.. ఇదేం ట్విస్ట్
Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ