Pushpa:‘పుష్ప’నైజాం రైట్స్ దిల్ రాజుకే...ఎంతకంటే

By Surya Prakash  |  First Published Dec 6, 2021, 9:36 AM IST

 అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ హిందీతోపాటు, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ విడుదలవుతోంది.  


నైజాం ఏరియాలో కింగ్ గా ఉన్న దిల్ రాజు కు గత కొద్ది కాలంగా బిజినెస్ పరంగా వ్యతిరేక పవనాలు వీచాయి. కొత్త కాంపిటేషన్స్ మొదలయ్యాయి. డిస్ట్రిబ్యూటర్ గా తగ్గి నిర్మాతగా భారీ చిత్రాలతో బిజీ అవుతున్నాడు దిల్ రాజు అనుకున్నారంతా. అయితే అది ఎంతో కాలం లేదు. ఇప్పుడు మళ్లీ పెద్ద సినిమాలు అన్ని ఆయన దగ్గరికే చేరుతున్నాయి. ఆల్రెడీ ఆర్ ఆర్ ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్ చిత్రాల నైజాం రైట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు పుష్ప సినిమా నైజాం రైట్స్ కూడా ఆయన సొంతం చేసుకున్నట్లు సమాచారం. 

అల్లు అర్జున్ కెరీర్ లో భారీ క్రేజ్ సంపాదించుకున్న పుష్ప (Pushpa)హ‌క్కులు కూడా దిల్ రాజు ద‌క్కించుకున్నాడ‌ని టాక్‌. ట్రేడ్ వర్గాల సమాచారం ప్ర‌కారం పుష్ప నైజాం హక్కుల‌ను దిల్ రాజు రూ.36కోట్ల‌కు ద‌క్కించుకున్నారు. మొదట రూ.45 కోట్ల‌కు చెప్పినా మైత్రీ మూవీస్ దిగి వచ్చి ఫైనల్ గా రూ.36కోట్ల‌కు లాక్ చేసిన‌ట్టు స‌మాచారం. అఖండ నైజాంలో దిల్ రాజు పదిన్నర కోట్లుకు తీసుకుని మంచి బిజనెస్ చేసారు. లాభాలు పొందుతున్నారు. ఈ ఊపులో మరిన్ని పెద్ద సినిమాలపై దిల్ రాజు కన్నేసినట్లు సమాచారం. 

Latest Videos

ఇక పుష్ప విషయానికి వస్తే..ప్రమోషన్స్ విషయంలో ‘పుష్ప’ తగ్గేదే లే అంటున్నాడు. విడుదల దగ్గర పడుతుండటంతో పబ్లిసిటీ కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రోజూకో ఓ కొత్త లుక్‌ తో    సామాజిక మాధ్యమాల్లో హంగామా చేస్తున్నారు.రీసెంట్ గా ఓ టీజర్ ని ముందస్తు  ట్రైలర్‌గా విడుదల చేసారు. అందులో కొన్ని సీన్స్ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని రోజులుగా తెరకెక్కిస్తున్న స్పెషల్ సాంగ్ శుక్రవారంతో ముగిసింది. 

ఈ నెల 17న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. 6న ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయికలో రెండు భాగాలుగా రూపొందుతున్న చిత్రమిది. తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ హిందీతోపాటు, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ విడుదలవుతోంది. ఇందులో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటించిన విషయం తెలిసిందే. సమంత స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ విలన్ గా నటించారు. అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు.  

click me!