కాజల్, అనుష్క కోసం ట్రై చేశారు.. తెలుగు అమ్మాయిల విషయంలో అది నిజమే!

Published : Nov 21, 2019, 10:48 AM ISTUpdated : Nov 21, 2019, 11:15 AM IST
కాజల్, అనుష్క కోసం ట్రై చేశారు.. తెలుగు అమ్మాయిల విషయంలో అది నిజమే!

సారాంశం

తెలుగు అమ్మాయిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈషా రెబ్బ ప్రస్తుతం నటిగా ఒక్కో మెట్టు ఎదుగుతోంది. గ్లామర్ రోల్స్ చేస్తూనే.. విభిన్నమైన పాత్రలకు అంగీకారం తెలుపుతోంది.

తెలుగు అమ్మాయిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈషా రెబ్బ ప్రస్తుతం నటిగా ఒక్కో మెట్టు ఎదుగుతోంది. గ్లామర్ రోల్స్ చేస్తూనే.. విభిన్నమైన పాత్రలకు అంగీకారం తెలుపుతోంది. ఈషా రెబ్బ ప్రధాన తాజాగా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాగాల 24 గంటల్లో'. ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రాగాల 24 గంటల్లో మూవీ శుక్రవారం నవంబర్ 22న రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ బుధవారం రోజు ప్రీరిలీజ్ వేడుక నిర్వహించింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈషా రెబ్బ ప్రసంగించింది. 

ఈ చిత్రంలో నటించడం తన అదృష్టం అని తెలిపింది. ముందుగా  ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి లాంటి స్టార్ హీరోయిన్స్ ని సంప్రదించారు. కుదరకపోవడంతో ఆ అవకాశం తనకు వచ్చిందని ఈషా రెబ్బ పేర్కొంది. శ్రీనివాస్ రెడ్డి నా చిత్రాలు చూశారు. నటన నచ్చడంతో ఆయన ఈ అవకాశం ఇచ్చారు. 

Also read: సంక్రాంతి సినిమాలు.. రిలీజ్ డేట్లు ఫైనల్ అయినట్లే!

నేను ఇంతకుముందే చెప్పినట్లుగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదు అనేది నిజమే. శ్రీనివాస్ రెడ్డి లాంటి దర్శకులు ఉండడం వల్ల తెలుగు వారికి ఛాన్సులు వస్తున్నాయి అని ఈషా పేర్కొంది. తెలుగు అమ్మాయిలు కూడా సినిమాల్లో నటించేందుకు ముందుకు రావాలి. ఇదే సరైన సమయం అని ఈషా రెబ్బ పిలుపునిచ్చింది. 

ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ తాను ఈ చిత్రానికి ఓకే చెప్పినప్పుడు కామెడీ సినిమాలు చేసే దర్శకుదు సస్పెన్స్ మూవీ చేయడం ఏంటి అనే కామెంట్స్ వచ్చాయి. శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన డమరుకం చిత్రం కామెడీ కాదు. అయినా ఒక దర్శకుడు అన్ని జోనర్ చిత్రాలు చేయాలి అని శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలిపింది. 

Also read: నాని, సురేష్ బాబు పై ఐటీ రైడ్స్.. శ్రీరెడ్డి సంతోషం!

తన భర్త హత్య చేయబడ్డ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా రాగాల 24 గంటల్లో చిత్రం తెరకెక్కింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. 

 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్