ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

By Udayavani DhuliFirst Published Oct 3, 2018, 10:44 AM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో నటి ఈషా రెబ్బ ముఖ్య పాత్ర పోషిస్తోంది. నిన్న జరిగిన సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న ఈషా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి.. 'మీ వల్లే నన్ను గేటు దగ్గర అరగంట సేపు ఆపేశారు' 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'అరవింద సమేత' సినిమాలో నటి ఈషా రెబ్బ ముఖ్య పాత్ర పోషిస్తోంది. నిన్న జరిగిన సినిమా ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొన్న ఈషా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి.. 'మీ వల్లే నన్ను గేటు దగ్గర అరగంట సేపు ఆపేశారు' అంటూ ఎన్టీఆర్ కోసం జనసంద్రంలా వచ్చిన అభిమానుల గురించి చెప్పుకొచ్చింది.

''ఈ సినిమాలో నేను చేస్తున్నానని తెలియగానే ఎన్టీఆర్ అభిమానులు చాలా సంతోషపడ్డారు. అది నా అదృష్టం. ఒక తెలుగామ్మయికి త్రివిక్రమ్ గారు అవకాశం ఇచ్చారు. అందుకే ఫ్యాన్స్ అంతగా సంతోషించారు. మీ అందరిలానే నేను కూడా జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద అభిమానిని. మీ వలనే నేను ఇక్కడ ఉన్నాను. 

కానీ ఈవేడుకకు వచ్చేప్పుడు గేటు ముందే అరగంట ఆపేశారు'' అంటూ వెల్లడించింది. తన మాటలతో అభిమానులను ఖుషీ చేసిన ఈ భామ.. ఫ్యాన్స్ హుషారు చూసి 'నేను కూడా మీతో జాయిన్ అయితే బాగుండేది' అంటూ వారిని మరింత ఖుషీ చేసింది.  

సంబంధిత వార్తలు.. 

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!

జీవితంలో కూడా నిజమైన హీరో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కామెంట్స్!

కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడ్చేసిన ఎన్టీఆర్!

ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం.. 'అరవింద సమేత' ట్రైలర్ టాక్!

'అరవింద సమేత' ప్రీరిలీజ్: ఎన్టీఆర్ రాకతో అభిమానుల కేకలు

'అరవింద సమేత' ప్రీరిలీజ్ హడావిడి.. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులు!

'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఎలా ఉండబోతుందంటే!

click me!