బాలయ్య స్మోకింగ్ వీడియో వైరల్!

Published : Oct 03, 2018, 10:03 AM IST
బాలయ్య స్మోకింగ్ వీడియో వైరల్!

సారాంశం

మూడేళ్ల క్రితం ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పబ్లిక్ ప్లేస్ లో పొగ తాగుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మూడేళ్ల క్రితం ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పబ్లిక్ ప్లేస్ లో పొగ తాగుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బాలయ్య పొగ తాగుతూ కెమెరాలకి చిక్కారు.

ఆ సమయంలో బాలయ్యని ట్రోల్ చేస్తూ చాలా విమర్శలు వచ్చాయి. ఇలాంటి సంఘటనే తాజాగా మరొకటి చోటు చేసుకుంది. ఖమ్మంలో సత్తుపల్లి నియోజకవర్గంకి వెళ్లిన బాలకృష్ణ అక్కడ దివంగత నందమూరి తారకరామరావు విగ్రహావిష్కరణ పూర్తి చేసి తిరిగి తన కారులోకి వెళ్లారు.

వెంటనే సిగరెట్ తీసి కాల్చడం మొదలుపెట్టారు. దానికి సంబంధించిన వీడియోని ఓ అభిమాని సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. 'బాలయ్య మాస్' అంటూ అభిమానులు గర్వంగా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?