తిరిగొచ్చిన నంది అవార్డులు: ఉత్తమ చిత్రం ‘ఈగ’

First Published Mar 1, 2017, 9:22 AM IST
Highlights

ఉత్తమ చిత్రం అవార్డును ఎగరేసుకుపోయిన ‘ఈగ’

నంది అవార్డులు మళ్లీ వచ్చాయి. విభజన గందరగోళం నుంచి బయటపడి 2012 సంవత్సరానికి గాను నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు  ప్రకటించింది. రాష్ట్ర విజభజన తర్వాత నంది అవార్డులను తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఇవ్వాలన్న సస్పెన్స్‑కు తెర వేస్తూ ఆంధప్రదేశ్ ప్రభుత్వం నేడు జాబితా విడుదల చేసింది.  నంది అవార్డుల లాగా తాము కొత్త అవార్డులను ఏర్పాటు చేస్తామని తెలంగాణా ప్రభుత్వం ప్రకటించడంతో  ఆంధ్రప్రదేశ్ తన అవార్డులను ప్రకటించేందుకు వీలయింది.

 

ఉత్తమ చిత్రం కోసం ఈగ, ఎటోవెళ్లిపోయింది మనసు, మిథునం పోటి పడినా అవార్డను  ఈగ ఎగరేసుకుపోయింది. ఈచిత్రం ఉత్తమ దర్శకుడు అవార్డులతో కలిపి ఆరు అవార్డులను సొంతం చేసుకోగా, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. మిథునంకు రెండు, మిణుగురులుకు రెండు అవార్డులు దక్కాయి. ఎస్వీ రంగారావు పురస్కారానికి గాను ఆశిష్ విద్యార్థిని ఎంపిక చేశారు. సీనియర్ నటి జయసుథ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎంట్రీ లను పరిశీలించి అవార్డును ప్రకటించింది.


2012 నంది అవార్డుల వివరాలు :

ఉత్తమ చిత్రం : ఈగ

ద్వితీయ ఉత్తమ చిత్రం : మిణుగురులు
తృతీయ ఉత్తమ చిత్రం : మిథునం
ఉత్తమ దర్శకుడు : రాజమౌళి ( ఈగ )
ఉత్తమ నటుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ నటి : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ)
ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం)
ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సంగీత దర్శకుడు :  కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు)
ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఈగ
ఎస్వీ రంగారావు పురస్కారం ఆశిష్ విద్యార్థి

click me!