
తనదైన శైలిలో నటించి విశేష గుర్తింపు పొందిన విలక్షణ బాలీవుడ్ నటుడు ఓం పురి. ఈ జనవరి మాసంలో ముంబైలో గుండె పోటుతో మృతి చెందిన ఓంపురిని అకాడమీ అవార్డు ప్రదానోత్సవ వేదికపై స్మరించుకున్నారు. సారా బేరియెల్స్ ప్రత్యేక పాటతో ఓంపురి స్మృతిగా నివాళులర్పించారు.
ఇటు బాలీవుడ్ లోనే కాక., అటు బ్రిటిష్ చిత్ర పరిశ్రమలోనూ.. ఓం పురికి ఎనలేని గుర్తింపు ఉంది. ఆయన మరణానంతరం జరిగిన ఈ 89వ ఆస్కార్ అవార్డు వేడుకకు సంబంధించిన ప్రోమో మంటాజ్ లో ఓంపురి కూడా నటించారు.
పద్మశ్రీ ఓంపురికి గుర్తింపు లభించడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం.