లేడీ నిర్మాతకు బెదిరింపులు.. సోషల్ మీడియాలో ఆమె ఫోన్ నెంబర్ పెట్టి..!

By Udayavani DhuliFirst Published Sep 22, 2018, 6:24 PM IST
Highlights

శుక్రవారం నుండి మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' ఒకటి కాగా.. విక్రమ్ 'సామి2', 'ఈ మాయ పేరేమిటో' చిత్రాలున్నాయి. 

శుక్రవారం నుండి మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' ఒకటి కాగా.. విక్రమ్ 'సామి2', 'ఈ మాయ పేరేమిటో' చిత్రాలున్నాయి. అయితే చిన్న చిత్రంగా విడుదలైన 'ఈ మాయ పేరేమిటో' ఇప్పుడు వివాదాలలో చిక్కుకుంది. ఈ సినిమాలో ఓ పాత హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై బిజెపి మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ సెన్సార్ బోర్డుకి లేఖ కూడా రాశారు. అరిహంతానం అనే పాటలో హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా ఉన్న లిరిక్స్ పై సెన్సార్ చైర్మన్ కి ఆయన లేఖ రాశారు. నిజానికి నెలరోజుల క్రితమే పాటలో లిరిక్స్ మార్చాలని అయన చిత్రబృందాన్ని హెచ్చరించారట.

అది వినకుండానే సినిమా విడుదల చేయడం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ చిత్ర నిర్మాత దివ్య.. లిరిక్స్ వచ్చిన సమయంలో మ్యూట్ చేశామని, అయినా ఇంకా ఎందుకు వివాదం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

కొందరి నుండి ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, సోషల్ మీడియాలో కావాలని ఆమె ఫోన్ పెట్టి సర్క్యులేట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. రాహుల్ కోసం తన సొంత అక్క నిర్మాతగా మారి ఈ సినిమాను తెరకెక్కించింది. 

click me!