యామీ గౌతమ్‌కి ఈడీ షాక్‌.. సమన్లు జారీ

Published : Jul 02, 2021, 02:23 PM IST
యామీ గౌతమ్‌కి ఈడీ షాక్‌.. సమన్లు జారీ

సారాంశం

ఇటీవల సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుని ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చిన యామీ గౌతమ్‌కి తాజాగా ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) షాక్‌ ఇచ్చింది. మనీలాండరింగ్‌ ఆరోపణల కేసులో ఈడీ యామీకి నోటీసులు జారీ చేసింది. 

ఇటీవల సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుని ఫ్యాన్స్ కి షాక్‌ ఇచ్చిన యామీ గౌతమ్‌కి తాజాగా ఈడీ(ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌) షాక్‌ ఇచ్చింది. మనీలాండరింగ్‌ ఆరోపణల క్రింద ఈడీ యామీకి నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిల్వల నిర్మహణ చట్టం(ఫెమా) ఉల్లంఘించినట్టు ఆరోపణలతో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా సమన్లు జారీ చేసింది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆమె స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయడానికి వచ్చే వారం ఈడీ ముందు హాజరు కావాలని కోరింది. యామీకి ఈడీ నోటీసులు ఇది రెండో సారి. అంతకు ముందు కూడా ఆమెకి ఇలాంటి నోటీసులు అందడం గమనార్హం. 

ఇటీవల బాలీవుడ్  భారీ చిత్రాలపై ఈడీ  దృష్టిపెట్టింది. మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఇప్పటికే  పలువురు బాలీవుడ్‌ నటీనటులను, ఇతర ప్రముఖులను విచారించిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో `నువ్విలా`, `గౌరవం`, నితిన్‌తో `కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది యామీ గౌతమ్‌కి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంది. `విక్కీ డోనర్‌`తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సొట్టబుగ్గల సుందరి హృతిక్‌తో `కాబిల్‌`, వరుణ్‌ ధావన్‌తో `బద్లాపూర్‌` వంటి భారీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఒక థ్రిల్లర్‌ మూవీలో నటిస్తోంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం యామీ.. నిర్మాత ఆదిత్య ధార్‌ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో వెల్లడించి ఫ్యాన్స్‌ను షాక్‌తోపాటు ఆశ్చర్యానికి గురి చేసింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది
Illu Illalu Pillalu Today Episode Dec 15: తాగేసి రచ్చ రచ్చ చేసిన వల్లీ, ఇచ్చిపడేసిన ప్రేమ