హాట్ స్టోరీ: విజయేంద్రప్రసాద్ కథతో పవన్ కళ్యాణ్

By Surya Prakash  |  First Published Jul 2, 2021, 1:38 PM IST

‘బాహుబలి’ సినిమా ఇంటర్వెల్ సీన్ కి.. పవన్ కళ్యాణ్ నే స్ఫూర్తిగా తీసుకున్నానని మీడియా ముందు చెప్పారు విజయేంద్రప్రసాద్. ఇప్పుడు ఆయన పవన్ కోసం కథ రాస్తుండడం విశేషం


మొత్తానికి పవన్ అభిమానులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న క్షణాలు వచ్చేసినట్లే కనపడుతున్నాయి.  రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజియేంద్ర ప్రసాద్ ,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కు రంగం సిద్దమైంది. వరసగా బాలీవుడ్,కోలీవుడ్ ప్రాజెక్టులకు కథలు అందిస్తున్న విజయేంద్రప్రసాద్ తాజాగా పవన్ కళ్యాణ్ ని కలిసి ఓ కథ వినిపించారని సమాచారం. మరి పవన్ ఏమన్నారు..డైరక్టర్ ఎవరు అనేగా మీ సందేహం ...

 బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కి పవన్ కల్యాణ్ అంటే ఇష్టం. ఆ విషయం ఆయన చాలా సార్లు స్వయంగా ఇంటర్వూలలో చెప్పారు. పవన్ కళ్యాణ్ ని మించిన పవర్ ఫుల్ యాక్టర్ మరొకరు లేరని అన్నారు. పవన్ పర్శనల్ క్యారక్టర్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్ ని దృష్టిలో పెట్టుకుని ఓ కథని రెడీ చేసారు. టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ని కలసి చెప్పటం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాసారు. కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు. అయితే ఇప్పుడే అసలైన సమస్య. 

Latest Videos

విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథకి న్యాయం చేస్తూ పవన్ హీరోగా ఈ కథని తెరకెక్కించేదెవరు. అయితే ఆ బాధ్యత పవన్ తీసుకున్నారని సమాచారం. నిర్మాత, దర్శకుడుని ఆయనే ఎంపిక చేసి చెప్తానని చెప్పినట్లు సమాచారం. అంటే త్వరలోనే ఆ కథ తెరకెక్కుతుందన్నమాట. ఇక గతంలో విక్రమార్కుడు కథ సైతం పవన్ కళ్యాణ్ కోసమే రాసారు విజయేంద్రప్రసాద్. అయితే అప్పుడు పవన్ బిజిగా ఉండటంతో చేయలేకపోయన సంగతి తెలిసిందే. 

గతంలో  విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ పై  ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయన పవన్ కళ్యాణ్ ను డైనమేట్ తో పోల్చారు. పవన్ కోసం ప్రత్యేకంగా కథ రాయాల్సిన అవసరం లేదని… ఆయన నటించిన సినిమాల్లో నుంచే అక్కడక్కడ కొన్ని సీన్స్ తీసుకుంటే కథ రెడీ అయిపోతుందని చెప్పారు. పవన్ సినిమాకు కథ గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని అన్నారు.

 పవన్ సినిమా కోసం కథ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. పవన్ ను చూడ్డానికే ప్రజలు సినిమాలకు వస్తారని… ఆయనను చూపించడంతో పాటు  మంచి సాంగ్స్ , విలన్లను చితగ్గొట్టడం, ప్రజలకు మంచి చేయడం వంటివి కొన్ని సినిమాలో ఉంటే సరిపోతుందని అన్నారు. డైనమైట్ పేలడానికి చిన్న అగ్గిపుల్ల ఉంటే సరిపోతుందని… పవన్ పెద్ద డైనమైట్ అని  విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

 ఇక పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ లో పవన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నారు పవన్. హరిహర వీరమల్లు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని టాక్. మొఘలాయుల కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. అలాగే మాలయాళంలో సూపర్ హిట్ అయినా అయ్యపనుమ్ కోషియమ్ సినిమాను రీమేక్ చేస్తున్నారు పవన్. ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు. 

click me!