డీవీ సినీ క్రియేషన్స్ చేతిలో క్రేజీ డబ్బింగ్ మూవీస్...

Published : Nov 08, 2016, 11:16 AM ISTUpdated : Mar 24, 2018, 12:16 PM IST
డీవీ సినీ క్రియేషన్స్ చేతిలో క్రేజీ డబ్బింగ్ మూవీస్...

సారాంశం

తెలుగులో డబ్బింగ్ సినిమాల హవా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలవైపు దృష్టి పెట్టిన నిర్మాతలు డీవీ సినీ క్రియేషన్స్ ఖాతాలో 3 క్రేజీ తమిళ సినిమాలు

ప్రస్థుతం తెలుగు రాష్ట్లాల్లో డబ్బింగ్ సినిమాల మార్కెట్ జోరందుకుంది. దీంతో నిర్మాతలంతా వాటి వైపు దృష్టి పెట్టారు. అలా డి.వి. సినీ క్రియేష‌న్స్ అధినేత డి. వెంక‌టేష్ మూడు క్రేజీ త‌మిళ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. జీవా, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన త‌మిళ చిత్రం క‌వ‌లై వేడ‌మ్. ఈ చిత్రాన్ని  ఎంత‌వ‌ర‌కు ఈ ప్రేమ టైటిల్ తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. విజ‌య్ సేతుప‌తి, గాయ‌త్రి న‌టించిన పురియాధ పుధీర్ చిత్రాన్ని తెలుగులో పిజ్జా 2 టైటిల్ తో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీని రంజిత్ జేయ‌కోడి తెర‌కెక్కించారు. డి.వి.క్రియేష‌న్స్ సంస్థ అందిస్తున్న‌మూడ‌వ చిత్రం అందాల ప్రేయ‌సి. ఈ చిత్రంలో వ‌సంత ర‌వి, ఆందేరి జేరేమై, అంజ‌లి త‌దిత‌రులు న‌టించారు. ఈ చిత్రాన్ని కూడా తెలుగు, త‌మిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయ‌నున్నారు. ఈ మూడు చిత్రాల రిలీజ్ డేట్స్ ను త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేయ‌నున్నారు.

PREV
click me!

Recommended Stories

Emmanuel Lover : ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, మరి పెళ్లి ఎప్పుడో తెలుసా?
5 కోట్ల బడ్జెట్ తో 50 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చంటే?