నటుడు విజయ్ అరెస్ట్!

Published : Sep 23, 2018, 07:33 PM IST
నటుడు విజయ్ అరెస్ట్!

సారాంశం

కన్నడ నటుడు దునియా విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఐ‌పి‌సి సెక్షన్ 365, 342, 325, 506 కింద కేసులు నమోదు చేశారు. మారుతి గౌడ అనే వ్యక్తిపై తన మనుషులతో దాడి చేయించిన కేసులో విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయంలోకి వెళ్తే.. మారుతి గౌడ అనే వ్యక్తి అంబేద్కర్ భవన్ వద్ద జరిగిన బాడీ బిల్డింగ్ పోటీలు చూడడానికి వెళ్లగా విజయ్ అతని స్నేహితులు పది మంది కలిసి అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బాధితుడు మాట్లాడుతూ.. ''మా అంకుల్ గురించి విజయ్ తప్పుగా మాట్లాడాడు. అలా ఎందుకు మాట్లాడుతున్నారని నేను ప్రశ్నించగా.. అతను ఓ పది మందితో కలిసి నాపై దాడి చేసి నన్ను అక్కడ నుండి తీసుకెళ్లారు. 

అలా కొంతదూరం ప్రయాణించిన తరువాత వాళ్లు ఓ చోట కారు ఆపి నాపై దాడి చేశారు''అంటూ వెల్లడించారు. అంతేకాదు ఆ దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలిపారు. బాధితుడు చేసిన ఫిర్యాదుతో పోలీసులు విజయ్ ని అదుపులో తీసుకున్నారు. విజయ్ ని త్వరలోనే కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్