బిగ్ బాస్2: నువ్ రౌడీవా..? తనీష్ పై నాని అసహనం!

By Udayavani DhuliFirst Published 22, Sep 2018, 10:27 PM IST
Highlights

ఈ వారం బిగ్ బాస్ షో రణరంగాన్ని తలపించింది. కౌశల్ కి మిగిలిన కంటెస్టెంట్స్ కి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాని వీటిపై ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తూ చాలా సెటిల్డ్ గా షోని పూర్తి చేశారు. 

ఈ వారం బిగ్ బాస్ షో రణరంగాన్ని తలపించింది. కౌశల్ కి మిగిలిన కంటెస్టెంట్స్ కి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఎపిసోడ్ లో ఎంట్రీ  ఇచ్చిన హోస్ట్ నాని వీటిపై ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తూ చాలా సెటిల్డ్ గా షోని పూర్తి చేశారు. ముందుగా గత వారం ఎపిసోడ్ తో తాను ఎంతగానో బాధ పడ్డానని చెప్పిన నాని.. హౌస్ లో 
ఉన్న ప్రెషర్ కారణంగా మీరంతా అలా ప్రవర్తించి ఉంటారు కానీ బయటకి మాత్రం అలా కనిపించడం లేదని అందరినీ సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.

ఇక తనీష్.. 'కౌశల్ ని బయటకి రా చూసుకుందాం' అని చేసిన కామెంట్ పై నాని.. తనీష్ ని ప్రశ్నించాడు. ''ఏంటి నువ్ రౌడీ అనుకుంటున్నావా..? కొద్దిసేపు నిన్ను కౌశల్ ని బయటకి పంపిస్తా.. టచ్ చెయ్ చూద్దాం.. ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి బిగ్ బాస్ కి నచ్చకపోతే ఇంటి నుండి బయటకి పంపించేస్తారు. అదే బయట అయితే తీసుకెళ్లి లోపల వేస్తారు. ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా.. నువ్ చేసిన కామెంట్ కరెక్ట్ కాదు'' అంటూ తనీష్ కి క్లాస్ పీకాడు.

దీప్తి రోజురోజుకి ఇంప్రూవ్ అవుతుందని ఇలానే కొనసాగాలని నాని ఆమెకి సూచించారు. ఫినాలేకి వెళ్లిన మొదటి కంటెస్టెంట్ సామ్రాట్ కి కంగ్రాట్స్ చెబుతూ.. కౌశల్ విషయంలో అరిచిన విషయంపై ప్రశ్నించారు. దానికి సమాధానంగా సామ్రాట్.. హౌస్ మేట్స్ కి కుక్కలతో పోల్చడం తట్టుకోలేక అలా ప్రవర్తించానని.. నేను ఆ పదాలు తీసుకోలేకపోయానని చెప్పారు.

గీతామాధురి వాడిన బూస్టప్ అనే పదంలో తప్పు లేదని దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముందని నాని అన్నారు. ఇక కౌశల్ ని ఉద్దేశిస్తూ 'కోపం లో కూడా ఎదుటివారికి మర్యాదిచ్చి మాట్లాడే మీ నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదని' అన్నారు. దానికి కౌశల్ ఏదో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతా విన్న నాని ఇక్కడితో ఈ హీటెడ్ డిస్కషన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరగా.. హౌస్ మేట్స్ అందరూ ఈ వారం మొత్తం సంతోషంగా ఉంటామని నానికి మాటిచ్చారు. 

సంబంధిత వార్త.. 

బిగ్ బాస్2: నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు.. కౌశల్ పై నాని కామెంట్స్!

Last Updated 22, Sep 2018, 10:28 PM IST