ఇప్పుడు అవన్నీ ఎందుకు..? రష్మిక కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Sep 23, 2018, 7:07 PM IST
Highlights

'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నతెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకొని వార్తల్లో నిలిచింది. 

'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నతెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకొని వార్తల్లో నిలిచింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించినరష్మిక అతడితో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లికి రెడీ అయింది.

ఇంతలోనే నిశ్చితార్ధం రద్దు చేయడంతో అందరూ రష్మికనే తప్పుబట్టారు. దీంతో రక్షిత్ సైతం ఈ విషయంలో ఆమెను బ్లేమ్ చేయొద్దని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ జంట ఎందుకు విడిపోయారనే విషయంలో సరైన కారణాలను వెల్లడించలేదు.

తాజాగా 'దేవదాస్' సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా ముందుకొచ్చిన రష్మికను నిశ్చితార్ధం ఎందుకు రద్దు చేసుకోవడానికి గల కారణాల గురించి చెప్పమని ప్రశ్నించారు. దానిపై స్పందించిన రష్మిక.. ''ఈ విషయం గురించి రెండు నెలల ముందు అడిగి ఉంటే అలాంటిదేమీ లేదని చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడు మాత్రం నా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడను. ఒకవేళ చెప్పాల్సి వస్తే సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తాను. అంతేకానీ సినిమా ప్రమోషన్స్ లో ఇవన్నీ ఎందుకు..?'' అని స్పష్టం చేశారు. 

click me!