నా వయస్సు పెరుగుతుంది...నువ్వలాగే ఉన్నావ్, భార్యకు దుల్కర్ సల్మాన్ బర్త్ డే విషెష్..

Published : Sep 05, 2022, 10:09 AM ISTUpdated : Sep 05, 2022, 10:10 AM IST
నా వయస్సు పెరుగుతుంది...నువ్వలాగే ఉన్నావ్, భార్యకు దుల్కర్ సల్మాన్ బర్త్ డే విషెష్..

సారాంశం

తన భార్యకు డిఫరెంట్ గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు  మలయాళ యంగ్ అండ్ స్టార్ హీరో దుల్కర్ సల్మన్. అందరిలా కాకుండా కాస్త కొత్తగా ఆలోచించాడు హ్యాండ్సమ్ హరో. 

తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకున్నాడు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి నటవారసుడిగా ఇండస్ట్రీకి వచ్చినా.. ఆయన సొంత టాలెంట్ తో.. స్టార్ ఇమేజ్ సాధించాడు. ఇప్పుడు టాలీవుడ్ లోనూ.. తన హవా మొదలెట్టాడు. మహానటి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దుల్కర్.. రీసెంట్ గా  సీతా రామం  సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి.. తెలుగులో తన విజయాల పరంపరను మొదలెట్టాడు. ఈ సినిమాతో సంచలనం సృష్టించాడు. 

ఇక సీతారామం సినిమా సక్సెస్ జోష్ ను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉన్న మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ .. తన భార్య పుట్టిన రోజుకు కు స్పెషల్ గా విషెష్ తెలియజేశాడు. ఈరోజు (05 సెప్టెంబర్) తన భార్య అమల్ సూఫియా పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.  దుల్కర్. నా స్వీటెస్ట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. మేమిద్దరం ఒక్కటై 12 సంవత్సరాలు పూర్తయింది. ఆ సమయం అంతా ఎక్కడికి పోయింది..? అంటూ స్వీట్ మెమోరీస్ ను నెమరువేసకున్నాడు. 

అంతే కాదు కాలం కదులుతూనే ఉంది.. నేను ముసలోడిని అవుతున్నా.... నువ్వు మాత్రం ఇప్పటికీ అలానే ఉన్నావు. నేను అప్పుడు చూసిన నా సుఫియా లానే ఉన్నావు అంటూ భార్యను గారం చేశాడు. అంతే కాదు  నేను షూటింగ్స్ కోసం  చాలా దూరంగా ఉన్నప్పుడు ఇంటిని  ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. ఇది నీకు బెస్ట్ బర్త్ డేగా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే .. అండ్ ఐలవ్ యూ... అంటూ.. భార్యకు ఎంతో ప్రేమతో...  శుభాకాంక్షలు చెపుతూ.. ఇన్ స్టాలో నోట్ రాసుకోచ్చాడు దుల్కర్. భార్య మీద తనకు ఉన్న ప్రేమనంతా.. ఒక్క సారిగా వెల్లడించాడు. 

 

మాలయాళ నటుడిగా ప్రస్తానం స్థార్ట్ చేసినా.. ఆతరువాత తమిళ్ లో తన సత్తా చాటుకుని..అక్కడ కూడా హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు దుల్కర్. ఆతరువాత టాలీవుడ్ నుటార్గెట్ చేసి.. ఇక్కడ కూడా సక్సెస్ సాధించాడు. ఈ యంగ్ హీరో లిస్ట్ లో మరిన్ని తెలుగు  సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది.  మరికొన్ని ప్రజోజల్స్ కూడా ఆయన గుమ్మం ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. 
 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?