
ఎంటర్ టైన్‌మెంట్ అడ్డా బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu 6) అంటూ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) హోస్ట్ గా `బిగ్ బాస్ తెలుగు 6` ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభమైంది. ఇందులో ఆటుపోట్లు ఉంటాయి. స్నేహం ఉంటుంది, దాన్ని వెనకాలు ఫైటింగ్‌లుంటాయని, ఎంత వినోదం ఉన్నా అంతిమంగా సక్సెస్ కోసం పోరాటమే ఇక్కడ అంతిమ గోల్ అని తెలిపింది బిగ్‌బాస్. రాజ్యానికి రాజు ఒక్కడే అని, బిగ్ బాస్‌లో టైటిల్ విన్నర్ గెలవడమే అందరి లక్ష్యమని తెలిపారు.
షోలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి కంటెస్టెంట్ తమ జీవితంలో విషాద ఘటనలను బిగ్ బాస్ ముందుకు చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు. వారి కేరీర్స్ ఎలా ప్రారంభమయ్యా. ఎదుర్కొన్న సవాళ్లను చెప్పారు. ఈ సందర్భంగా హౌజ్ లోకి వచ్చిన మేల్ కంటెస్టెంట్ ‘ఎస్ఎస్ రాజమౌళి నుంచి ఆఫర్ వచ్చిన రోజే.. తల్లి కోల్పోయానని’ చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరనేది చూద్దాం. ‘నాపేరు షానీ నాది వండర్ ఫుల్ కహానీ అంటూ 14వ కంటెస్టెంట్ గా ఎంటరయ్యారు.
తన అసలు పేరు సొలమాన్ గా చెప్పారు. జడ్చర్లకు చెందిన ఈయన ప్రొఫెషనల్ ఖోఖో ప్లేయర్. నేషనల్ లెవల్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్. 2003లో తన కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అనారోగ్యం కారణంగా తన ప్రొఫెషన్ కు వీడ్కోలు పలికారు. అదే సమయంలో రాజమౌళి ‘సై’ సినిమాలో స్పోర్ట్స్ మెన్ గా ఎంపికయ్యారు. కానీ తనకు కాల్ వచ్చిన రోజే తన మదర్ కూడా చనిపోయిందని ఎమోషనల్ అయ్యాడు. లైఫ్ అంటే హ్యాపీ వర్సెస్ సారో అని, తన ఫెవరేట్ షో ‘బిగ్ బాస్’కు ఎంపిక కావడం హ్యాపీగా ఉందన్నారు. బిగ్ బాస్ తో మాట్లాడుతూ తన ఐదుగురి లవర్స్ పేర్ల నుంచి మొదటి అక్షరాన్ని తీసుకొని (శ్రీలత, హర్షిత, అనితా, నిషా, ఇషా) షానీగా పెట్టుకున్నట్టు తెలిపారు. అదే పేరును ‘సై’ చిత్రంలోనూ పెట్టారని చెప్పారు.
దాదాపు వంద రోజులపాటు సాగే ఈ వినోదాత్మక రియాలిటీ షో గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. నాగ్ సింపుల్ ఎంట్రీతో ఈ షోని ప్రారంభించారు. మొదట బిగ్ బాస్ 6 హౌజ్‌ని చూపించారు. ఈ సారి వెరైటీగా మ్యూజిక్ తో చూపించారు. మొదట సిట్టింగ్ ఏరియాని, తర్వాత స్విమ్మింగ్ పూల్, బాత్ రూమ్, గార్డెన్ ఏరియా, కిచెన్, లివింగ్ రూమ్, బాల్కానీ, స్టోర్ రూమ్, కన్ఫెషన్ రూమ్‌లు దగ్గరుంచి చూపించారు.