భూమా మౌనికా రెడ్డితో కనిపించిన మంచు మనోజ్ .. ప్రత్యేక పూజలు, పెళ్లి చేసుకోబోతున్నారా..?

Siva Kodati |  
Published : Sep 04, 2022, 08:47 PM IST
భూమా మౌనికా రెడ్డితో కనిపించిన మంచు మనోజ్ .. ప్రత్యేక పూజలు, పెళ్లి చేసుకోబోతున్నారా..?

సారాంశం

సినీనటుడు మంచు మనోజ్ రెండో పెళ్లికి రెడీ అయ్యారా అంటే అవుననే వస్తున్నాయి ఊహాగానాలు. అయితే ఏకంగా ఆయన మరింత క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని మనోజ్ వివాహం చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.   

హైదరాబాద్ సీతాఫల్ మండిలో ఓ వినాయక మండపానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు సినీనటుడు మంచు మనోజ్. ఆయనతో పాటు దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డి పక్కనే వుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లి విషయంపై నో కామెంట్ అని స్పందించారు మంచు మనోజ్. టైం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని ఆయన పేర్కొన్నారు. 

ALso REad:'G' బలిసిన వాళ్లే ఈ పని చేసింది.. ఏకిపారేసిన మంచు మనోజ్

కాగా.. మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. కారణం ఏమైనా కానీ 2019లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. పరస్పర అవగాహనతో విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేశారు. కెరీర్ పరంగా కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మనోజ్ జీవితంలో విడాకులు, కుదుపుకు గురిచేశాయి. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న మనోజ్ అహం బ్రహ్మస్మి అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించారు. ఇక 2017లో విడుదలైన ఒక్కడు మిగిలాడు చిత్రం తరువాత మనోజ్ హీరోగా మరో మూవీ విడుదల కాలేదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Regina Cassandra: ముస్లింగా పుట్టి క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టుకుందో చెప్పేసిన రెజీనా
అఖండ 2 కు ఎదురుదెబ్బ, బాలయ్య సినిమా వసూళ్లలో భారీ పతనం, 4వ రోజు కలెక్షన్స్ ఎంతంటే?