Latest Videos

`పుష్ప2` వాయిదా?.. రంగంలోకి దిగిన రామ్‌ పోతినేని.. `డబుల్‌ ఇస్మార్ట్` కి అదిరిపోయే డేట్‌

By Aithagoni RajuFirst Published Jun 15, 2024, 4:24 PM IST
Highlights

రామ్‌ పోతినేని, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో `డబుల్‌ ఇస్మార్ట్` మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. 
 

ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ పోతినేని ప్రస్తుతం డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌తో `డబుల్‌ ఇస్మార్ట్` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తనకు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని ఇచ్చిన `ఇస్మార్ట్ శంకర్‌`కి సీక్వెల్‌ గా ఈ మూవీ రూపొందిస్తుంది. ప్రస్తుతం దర్శకుడు పూరీ, హీరో రామ్‌ ఫెయిల్యూర్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్‌తో మరోసారి హిట్‌ కొట్టి బౌన్స్ బ్యాక్‌ కావాలని చూస్తున్నారు. అందులో భాగంగా పూరీ జగన్నాథ్‌ చాలా జాగ్రత్తగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట. ఈ సారి ఎలాగైన మిస్‌ కాకుడదని భావిస్తున్నారట. 

`ఇస్మార్ట్ శంకర్‌`కి సీక్వెల్‌ కావడంతో యాక్షన్‌, మాస్‌ ఎలిమెంట్లు డబుల్‌ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ దుమ్మురేపేలా ఉంది. దానికి తగ్గకుండా సినిమాని ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ఇందులో సంజయ్‌ దత్‌ నటిస్తుండటం విశేషం. ఇది సినిమాపై అంచనాలను పెంచుతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందనేది పెద్ద మిస్టరీగా మారింది. నిజానికి పూరీ జగన్నాథ్‌ సినిమాలు చాలా వేగంగా పూర్తవుతాయి. రిలీజ్‌ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుంది. కానీ ఈ మూవీ ప్రారంభమై చాలా రోజులవుతుంది. ఏడాది కావస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్‌పై క్లారిటీ లేదు. రామ్‌ అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్‌ డేట్‌ని ఇచ్చింది టీమ్‌. అదిరిపోయే డేట్‌కి రాబోతుంది. ఆగస్ట్ 15న సినిమాని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. లాంగ్‌ వీకెండ్‌ ఉన్న నేపథ్యంలో సినిమా కలిసొస్తుందని భావించి రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అదే రోజు `పుష్ప2` రాబోతుంది. ఆ మూవీ కోసం ఇండియా వైడ్‌గా ఎదురుచూస్తున్నారు. దానితో పోటీ పడేందుకు ఎవరూ సాహసం చేయడం లేదు. ఇతర భాషల సినిమాలు కూడా వెనక్కి తగ్గే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రామ్‌ సినిమా వస్తుండటం ఆశ్చర్యంగా మారింది. 

ఇదే అనేక కొత్త అనుమానాలను రేకెత్తిస్తుంది. `పుష్ప2` పోస్ట్ పోన్‌ అవుతుందా అనే సందేహాలను తెస్తుంది. `పుష్ప2` షూటింగ్‌ కి సంబంధించిన అప్‌ డేట్‌ లేదు. ఎంత వరకు కంప్లీట్‌ అయ్యిందనేది టీమ్‌కే తెలియడం లేదు. దర్శకుడు సుకుమార్‌ తీసుకుంటూ వెళ్తున్నారట. ఎంత ఫూటేజ్‌ వస్తుందో తెలియడం లేదు. ఆగస్ట్ 15కి వస్తుందా రాదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయినా ప్రతిసారి రిలీజ్‌పై నిర్మాతలు క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఆ డేట్‌కి ఎలాగైనా సినిమాని తీసుకురావాలని చూస్తున్నారు. కానీ సుకుమార్‌ ఏం చేయబోతున్నాడనేది డౌట్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు `డబుల్‌ ఇస్మార్ట్` మూవీని అదే డేట్‌కి ప్రకటించడంతో సందేహాలు ప్రారంభమయ్యాయి. 

`పుష్ప2` బ్యాక్‌ వెళ్తుందని ఆ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారా? లేక `పుష్ప2`తోనే పోటీ పడతారా? అనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. ఇక `డబుల్‌ ఇస్మార్ట్` చిత్రంలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. పూరీతోపాటు ఛార్మి ఈ మూవీని నిర్మిస్తున్నారు. దీన్ని పాన్‌ ఇండియా లెవల్‌లోనే రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. 

LOCKED & LOADED WITH DOUBLE IMPACT 😎👊🔥

The highly anticipated action-packed thriller
'Ustaad' &
Dashing Director 's GRAND RELEASE IN CINEMAS ON AUGUST 15th, 2024❤️‍🔥 💥 … pic.twitter.com/APmDtBqZdN

— Puri Connects (@PuriConnects)
click me!