Latest Videos

‘మనమే’ కలెక్షన్స్ కు కృతి శెట్టి దెబ్బకొట్టిందా? మండిపడుతున్న టీమ్

By Surya PrakashFirst Published Jun 15, 2024, 12:41 PM IST
Highlights

 ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్.. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

సినిమా తీయటం ఒకెత్తు అయితే ప్రమోట్ చేసి రిలీజ్ చేయటం మరొక ఎత్తు. అలాగే రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి తీసుకెళ్లాలా, జనం మాట్లాడుకునేలా హీరో,హీరోయిన్స్  ప్రమోషన్స్ చేయాల్సిన సిట్యువేషన్. అయితే కొందరు హీరోలు,హీరోయిన్స్ అందుకు ఒప్పుకోవటం లేదు. సినిమా చేయటంతో తమ భాద్యత అయ్యిపోయిందనుకుంటున్నారు. సినిమా అనేది కోట్లతో కూడిన బిజినెస్ . దాంతో ఒక్క నాలుగు రోజులు హీరో లేదా హీరోయిన్ ప్రమోషన్స్ కు వస్తే బాగుండేది కదా అని దర్శక,నిర్మాతలు అనుకోవటం లో తప్పులేదు. ఇప్పుడు మనమే సినిమాకు అదే పరిస్దితి ఎదురైంది.

వాస్తవానికి క్రిందటివారం పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్స్‌లో విడుదల కాలేదు. వచ్చిన సినిమాల్లో కాస్త ఇంట్రస్ట్ కలిగి ఉన్న చిత్రం ఏదైనా ఉందా అంటే.. అది శర్వానంద్‌ నటించిన మనమే మూవీ.  దర్శకుడు డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్.. భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సినిమాలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. 

ఈ సినిమా విడుదలకు ముందు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. మనమే సినిమాలో ఏకంగా 16 పాటలు ఉన్నాయి. ఈ సినిమా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీకి యావరేజ్ టాక్ వచ్చింది. మనమే సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కానీ ఆ బజ్ సరిపోవటం లేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కు కృతి శెట్టిని అడిగారట. ఓ రెండు రోజులు తమకు కేటాయిస్తే చాలు అని చెప్పారట. 

అయితే కృతి మాత్రం తాను తమిళ కమిట్మెంట్స్ లో బిజిగా ఉన్నానని చెప్పి నో చెప్పిందట. రిలీజ్ కు ముందు ప్రమోట్ చేసి చెన్నైకు వెల్లిపోయింది. రిలీజ్ తర్వాత థియేటర్స్ విజిట్ చేయటం, మీడియాని కలిసి సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడి బజ్ క్రియేట్ చేయటం వంటి చేయలేదు. ఖచ్చితంగా హీరో,హీరోయిన్స్ ప్రమోషన్స్ లో పాల్గొంటే కలెక్షన్స్ పికప్ అవుతాయని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. హీరోయిన్ లేనిదే హీరో ముందుకు రాడు. దాంతో సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యిపోయింది. 

‘మనమే’ చిత్రానికి రూ.12.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.13 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.6.13 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.6.87 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఈ సినిమాలో హీరో శర్వానంద్, హీరోయిన్ కృతి శెట్టి ఎంతో అద్భుతంగా నటించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా కథ అంతా ఓ చిన్న పిల్లాడి చుట్టూ తిరుగుతుంది. ఇక సినిమాలో శర్వానంద్, చిన్న పిల్లాడి మధ్య వచ్చే సీన్స్ ఎంతో హిలేరియస్‌గా, కామెడీగా ఉన్నాయి అంటున్నారు చిత్రం చూసిన ప్రేక్షకులు. ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాక సినిమాలోని ఎమోషన్స్ ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.  
 

click me!