Latest Videos

విజయ్ సేతుపతి ‘మహారాజ’ Ott రిలీజ్ డిటేల్స్.. ఎప్పుడొస్తుందంటే?

By Surya PrakashFirst Published Jun 15, 2024, 1:13 PM IST
Highlights

అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడం విశేషం. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రి’ సంస్థ పై శశి రిలీజ్ చేసారు.  


‘మాస్టర్’ ‘ఉప్పెన’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో  విజయ్ సేతుపతికు తెలుగులో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఆయన నటనకు  తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారు.అయితే ఆయన హీరోగా వచ్చిన డబ్బింగ్  సినిమాలను మాత్రం ఆదరించలేదు. ఓ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా విజయ్ సేతుపతికి మంచి ఆదరణ ఇచ్చారు మనవాళ్లు. ఈ క్రమంలో  విజయ్ సేతుపతి హీరోగా చేసిన ‘మహారాజ’ ని జూన్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మార్నింగ్ షో నుంచే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సుధీర్ బాబు హరోం హర చిత్రం కన్నా ఈ సినిమాకే జనం ఎక్కువ మార్కులు వేసారు. స్క్రీన్ ప్లే అదిరిపోయిందని మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఏ ఓటిటిలో వస్తోందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. రిలీజైన నెల రోజుల్లో ఈ సినిమా ఓటిటిలో వస్తుందని చెప్తున్నారు. అయితే రన్ బాగుంటే మరో పదిహేను రోజులు అంటే 45 రోజులు తర్వా వస్తుంది. నెల కు వస్తుందా 45 రోజులుకు వస్తుందా వేచి చూడాలి. ఈ విషయమై  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ప్యాషన్ స్టూడియోస్’, ‘ది రూట్’ సంస్థలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి లు నిర్మించారు. అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడం విశేషం. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రి’ సంస్థ పై శశి రిలీజ్ చేసారు.   ‘మహారాజ’ చిత్రానికి తెలుగులో రూ.1.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.1.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో చూడాలి.
 
నేను నటించి, విడుదలైన సినిమాలు 50 కావొచ్చు. కానీ 500 కంటే ఎక్కువ కథలే నేను విన్నాను అంటూ తన కెరీర్‌ గురించి చెప్పారు విజయ్‌ సేతుపతి. తన జీవితంలో ఎంతో మందిని కలిశానని, ఎన్నో విజయాలు చూశానని, మరెన్నో పరాజయాలూ చూశానని చెప్పిన విజయ్‌ సేతుపతి.. అందువల్లే ఎంతో అనుభవాన్ని సంపాదించాను అని చెప్పుకొచ్చారు. అలాగే గతాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయడం తనకు ఇష్టం ఉండదని చెప్పాడు.
 

click me!