KGF Chapter 2 : ‘కేజీఎఫ్2’సినిమాను పైరసీ చేయకండి.. థియేటర్ లోపల ఫోన్లలోనూ బంధించకండి.. మేకర్స్ హెచ్చరిక

Published : Apr 14, 2022, 07:57 AM IST
KGF Chapter 2 : ‘కేజీఎఫ్2’సినిమాను పైరసీ చేయకండి.. థియేటర్ లోపల ఫోన్లలోనూ బంధించకండి.. మేకర్స్ హెచ్చరిక

సారాంశం

యావత్ ప్రపంచం ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. ఈ చిత్రం ఎట్టకేళలకు థియేటర్లలోకి ఈ రోజు వచ్చేసింది. ఈ సందర్భంగా సినిమాను ఎవరూ పైరసీ చేయొద్దని మేకర్స్ హెచ్చరించారు. నెటిజన్లకూ సూచించారు.  

ఎలాంటి అంచనాలు లేకుండా కన్నడ నుంచి వచ్చిన ఓ సినిమా ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. అదే `కేజీఎఫ్‌` (KGF). కన్నడ చిత్ర పరిశ్రమ సత్తాని చాటిన చిత్రమిది. దాదాపు 250కోట్లు వసూలు చేసింది. కన్నడలో అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన చిత్రమిది. ఆ టైమ్‌లో నాన్‌ `బాహుబలి` రికార్డులు తిరగరాసింది. కోలార్‌ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఓ సాధారణ వ్యక్తి అసాధారణంగా ఎదిగే కథాంశంతో రూపొందిన `కేజీఎఫ్‌` సినిమా సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచింది. `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`RRR తర్వాత ఆ స్థాయి భారీ అంచనాలతో వస్తోన్న సినిమా `కేజీఎఫ్2 KGF Chapter 2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

పెద్ద సినిమాలకు మరో చిక్కు వచ్చి పడింది. సినిమా రిలీజ్ అయిన మొదటిరోజే కొందరు మొత్తం సినిమాను వీడియోల్లో బంధించి ఇంటర్నెట్ లో వదులుతున్నారు. అలాగే వీక్షకులు కూడా తమ సెల్ ఫోన్లలో ఫొటోలు, సినిమాలోని హైలెట్ సీన్స్ ను బంధిస్తున్నారు. దీని ద్వారా సినిమాలోని అతి ముఖ్యమైన మరియు ప్రాణం పోసే సన్నివేశాలు లీక్ అవుతున్నాయి.  గత నెల మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన భారీ బడ్జెట్, మల్టీస్టారర్ ఫిల్మ్ RRRకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. సినిమా మొత్తాన్ని కొందరు ఫోన్లలో షూట్ చేసి ఇంటర్నెట్ లో వదిలారు. అలాగే సినిమా మొదటి షో ఆడే సరికే ఇంటర్నెట్ లోకి బోలేడన్నీ ఆర్ఆర్ఆర్ ఫొటోలు వచ్చి చేరాయి. 

ప్రస్తుతం అలాంటి సమస్యకు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ మేకర్స్ చెక్ పెట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఈ మేరకు నిన్న ప్రటకన చేస్తూ.. ‘8 సంవత్సరాల రక్తం, చెమట మరియు కన్నీళ్లు మీ అందరి ముందుకు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ని  తీసుకురావడానికి దారితీశాయి. థియేటర్లలో KGF2 చూస్తున్నప్పుడు వీడియోలు తీసుకోవద్దని మరియు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయవద్దని అందరినీ కోరుతున్నాం. కేజీఎఫ్ గొప్పతనాన్ని థియేటర్లలో మాత్రమే అనుభవిద్దాం. బిగ్ స్క్రీన్ పై చూడటానికి వేచి ఉన్న ఇతరుల సంతోషాన్ని పాడుచేయవద్దు. పైరసీకి నో చెప్పండి’ అంటూ మేకర్స్ నోట్ రిలీజ్ చేశారు.  ఎవరైనా సినిమాను పైరసీ చేయాలని చూస్తే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా యాంటీ పైరసీ నియంత్రణ టీంను సిద్ధంగా ఉంచారు. ఈ మేరకు పైరసీపై సమాచారం అందితే వెంటనే తెలియజేయాలని ఫోన్ నెంబర్లు కూడా తెలియజేశారు. భారీ విజువల్స్, మాస్ యాక్షన్స్, హై రిసోల్యూషన్, సౌండింగ్ ను థియేటర్లలోనే ఎంజాయ్ చేయాలని కోరుతున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?