
మూడు నెలల్లో వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం. భారీ చిత్రాల విడుదల ఉంది. రవితేజ ఖిలాడి చిత్రం నుండి మహేష్ సర్కారు వారి పాట వరకు సమ్మర్ కానుకగా పెద్ద చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో రాధే శ్యామ్(Radhe Shyam), ఆర్ ఆర్ ఆర్ (RRR movie)వంటి పాన్ ఇండియా చిత్రాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్స్ ధరల విషయంలో సందిగ్దత కొనసాగుతుంది. టికెట్స్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద చిత్రాల నిర్మాతలు, స్టార్ హీరోలు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో చిత్ర మనుగడ సాధ్యం కాదంటున్నారు.
చాలా రోజులుగా ఈ విషయమై పరిశ్రమ పెద్దలు ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తుంది. పలుమార్లు చర్చలు జరిగినా సఫలం కాలేదు. అయితే టికెట్స్ ధరలు ఎంత మేర పెంచాలి అనే విషయంపై ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా టికెట్స్ ధరలు పెంచే ఆస్కారం కలదు. ఇక ఓ రెండు వారాల క్రితం చిరంజీవి వ్యక్తిగతంగా సీఎం జగన్ (CM Jagan)ని కలిశారు. ఇద్దరూ కలిసి లంచ్ చేయడంతో పాటు పరిశ్రమ సమస్యల గురించి ప్రస్తావించారు. ఈ మీటింగ్ అనంతరం... చిరంజీవి మాట్లాడుతూ సీఎం జగన్ సమస్యల పరిష్కారంపై సానుకూలంగా ఉన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కారం దొరకనుంది, అప్పటి వరకు పరిశ్రమ ప్రముఖులు మౌనం వహించాలని కోరారు.
కాగా రేపు చిరంజీవి (Chiranjeevi)నేతృత్వంలో సీఎం జగన్ కీలక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కి స్టార్ హీరోలుగా ఉన్న ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ హాజరవుతున్నట్లు సమాచారం అందుతుంది. కొద్దిరోజులుగా ఈ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్ ఈ మీటింగ్ లో పాల్గొనాలా? వద్దా? అనే మీమాంసలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీరందరూ పాల్గొనేలా చిరంజీవి ఒప్పించినట్లు సమాచారం. దీనితో రేపు చిరంజీవితో పాటు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ సీఎం జగన్ ని కలవనున్నారు.
ఇది ఒక విధంగా అరుదైన సంఘటన అని చెప్పాలి. ముగ్గురు టాప్ స్టార్స్ ఒకే వేదిక పంచుకోవడం గొప్ప విషయంలో. ఈ మధ్య కాలంలో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ కలిసి కనిపించలేదు. ఎన్టీఆర్(NTR), మహేష్ (Mahesh babu)కొన్నాళ్ల క్రితం కలిసిన సందర్భాలు ఉన్నాయి. మహేష్, ఎన్టీఆర్ లతో ప్రభాస్ కలిసిన దాఖలాలు లేవు. రేపు ఈ అరుదైన ఘటన ఆవిష్కృతం కానుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ కీలక భేటీలో పాల్గొననున్నారు. రేపు జరగనున్న మీటింగ్ అనంతరం టికెట్స్ ధరలు, బెనిఫిట్ షోల వంటి కీలక అంశాలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి వచ్చినది అనేది కీలకం.